సీఎం చంద్రబాబు కూటమిలో భాగంగా ఎవరు తప్పు చేసినా కూడా వారి పైన కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కల్తీ మద్యం కేసులో టిడిపి నేతలపై ఆరోపణలు రావడంతో టీడీపీ అధిష్టానం ఆ నేతలకు భారీ షాక్ ఇచ్చింది. కల్తీ మద్యం కేసులో జయచంద్ర రెడ్డి, సురేష్ నాయుడు వంటి నేతల పేర్లు వినిపించడంతో టీడీపీ పార్టీ నుంచి వీరిని సస్పెండ్ చేసినట్టుగా ఈమెరకు తాజాగా టిడిపి అధికార ప్రకటన కూడా విడుదల చేసింది.


ఇటీవల సీఎం చంద్రబాబు నకిలీ మద్యం విషయం పైన సమీక్ష నిర్వహించగా అన్నమయ్య జిల్లా మొలుకల చెరువు సమీపంలో నకిలీ మధ్య వ్యవహారంలో నిందితులు బయటపడగా విరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటు సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు.రాష్ట్రంలో నకిలీ మద్యం చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ తెలియజేశారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించేటువంటి ఇలాంటి విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామంటూ టిడిపి నేతలను సస్పెండ్ చేసి మరొకసారి రుజువు చేశారు. కల్తీ మద్యం విషయం పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు.


సీఎం చంద్రబాబుకు సంబంధించి  సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం జగన్  స్పందిస్తూ చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు అంటూ ఆరోపణలు చేశారు. ఏపీ రాష్ట్రాన్ని నకిలీ లిక్కర్ వ్యవహారంలో నెంబర్ వన్ స్థానంలో తీసుకువెళ్లారని ఫైర్ అయ్యారు. అన్నమయ్య జిల్లాలో ఏకంగా టిడిపి నాయకుల కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీని పెట్టి మరి సప్లై చేసిన ఘటన వల్ల రాష్ట్రంలో అక్రమ మద్యం పరిస్థితి ఎలా ఉందో ఎందుకు నిదర్శనమని, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మరి టిడిపి నేతలు ఇలాంటి పనులు చేస్తున్నారని ఇలాంటి అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు పంచుతున్నారంటూ వైసిపి అధినేత ఆరోపణలు చేశారు. ఎక్కడ చూసినా కూడా గ్రామాలలో బెల్టు షాపులు, కల్తీ మద్యం వ్యాపారంతో అడ్డగోలుగా సంపాదిస్తున్నారంటూ వైఎస్ జగన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: