
రిషబ్ శెట్టి స్వయంగా నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఉన్న దేవతా కాన్సెప్ట్, రా అండ్ రస్టిక్ విజువల్స్, భక్తి-ఆధ్యాత్మికత మేళవింపుతో వచ్చిన నేటివిటీ — అన్నీ కలసి ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేశాయి. ఇక రిషబ్ దర్శకత్వం, నటన రెండింటికీ కూడా సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “బాహుబలి సినిమాను రాజమౌళి ఎలాంటి స్థాయిలో తీర్చిదిద్దారో, అదే స్థాయిలోనే కాక మరింత ఆకర్షణీయంగా కాంతారలో కొన్ని సీన్స్ ఉన్నాయి” అంటూ పలువురు ఫిలిం క్రిటిక్స్ కూడా రాసేశారు.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో “రాజమౌళి స్టైల్ ఆఫ్ డైరెక్షన్‌ను చాలామంది ఫాలో అవుతున్నారు, కాపీ కొడుతున్నారు” అనే కామెంట్లు ట్రెండ్ అవుతున్నాయి. ఒకప్పుడు విఎఫెక్స్ అంటే రాజమౌళి సినిమా అని చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ పెద్ద సినిమా అదే లెవల్ విజువల్స్‌తో వస్తోంది. అందువల్ల “రాజమౌళి ప్రత్యేకత క్రమంగా తగ్గిపోతోందా..?” అనే చర్చ మరింత వేడెక్కుతోంది. ఫ్యాన్స్ మధ్య కూడా రెండు వర్గాలుగా విభజన కనపడుతోంది. ఒక వర్గం “రాజమౌళి లెగసీ ఎవరు తీసిపారేయలేరు, ఆయన సినిమా ఒక్కదే టికెట్” అంటుంటే, మరో వర్గం “ఇప్పుడు ప్రతి దర్శకుడూ పెద్ద విజువల్ సినిమాలు చేస్తూ ఉండటంతో రాజమౌళి క్రేజ్ తగ్గిపోతుంది” అని అంటోంది.
ఏదేమైనా, ఈ టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తుంది. ఇండస్ట్రీలో ఉన్నవారు, సినిమా అభిమానులు అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు —“ఇండియన్ సినిమా విజువల్ వండర్ రాజమౌళి యుగం ముగుస్తుందా..? లేక మరింత శక్తివంతమైన రీ-ఎంట్రీకి ఇది ఆరంభమా..?”.ఏమో దీనికి ఆన్సర్ తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడాలి...??