
అయితే ఇప్పుడు ఈ జంట గురించి కొత్త చర్చ నడుస్తోంది. ఎంగేజ్‌మెంట్ అయి కేవలం నాలుగు రోజులు కూడా కాలేదు, కానీ రష్మిక తిరిగి తన సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ మొదలైంది. కొందరు ఆమె ప్రొఫెషనలిజం పట్ల ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు మాత్రం సాంప్రదాయం పాటించలేదని విమర్శిస్తున్నారు. సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం అయిన తర్వాత కొన్ని రోజులు వరకు ఇంట్లోనే ఉంటారు. పసుపు కాళ్లతో బయటికి రాకూడదని మన పెద్దలు చెబుతారు. కానీ రష్మిక మాత్రం ఆ రీతిని పక్కన పెట్టి, తన కమిట్‌మెంట్‌కి ప్రాధాన్యం ఇచ్చిందట. ఈ విషయంపై కొంతమంది నెటిజన్లు, “ఇది ఫాస్ట్ జనరేషన్… ఒక్కరోజు షూటింగ్ ఆపేస్తే కోట్ల నష్టం వస్తుంది. రష్మిక చేసిన పని సరిగానే ఉంది” అని అంటుంటే, మరికొందరు మాత్రం “మన సాంప్రదాయాలు ఇలాగే నశిస్తాయా?” అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చర్చల మధ్య రష్మిక మాత్రం మైండ్ చేసుకోకుండా తన పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రెండు పెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఒకటి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండగా, మరొకటి బాలీవుడ్ ప్రాజెక్ట్ అని సమాచారం. ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నా, పర్సనల్ లైఫ్‌లో కూడా ఆమె సంతోషంగా ఉందన్నది అభిమానుల అభిప్రాయం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఇప్పుడు రష్మిక నిశ్చితార్థం, ఆమె షూటింగ్ రీ-ఎంట్రీ, ఈ రెండూ కలిపి హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలన్నీ ఈ చర్చలతో కిటకిటలాడుతున్నాయి. కొందరు ఆమెను "ప్రొఫెషనల్ క్వీన్" అని పొగడ్తలతో ముంచెత్తుతుంటే, మరికొందరు మాత్రం “సాంప్రదాయాలకు విలువ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం” అంటున్నారు.మొత్తానికి — నిశ్చితార్థం తర్వాత కూడా తన కెరీర్‌కి ప్రాధాన్యం ఇస్తూ, కొత్త జోష్‌తో ముందుకు సాగుతున్న రష్మిక మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. రాబోయే రోజుల్లో ఆమె అధికారికంగా స్పందిస్తుందా అన్నది ఇప్పుడు అందరి ఆసక్తి విషయం..!