ఈ సినిమా అక్టోబర్ 17న తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి భారీగా విడుదల కాబోతోంది. రిలీజ్‌కి ముందు ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్న మూవీ టీమ్, తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఆర్గనైజ్ చేసింది. ఆ ఈవెంట్‌లో యాంకర్ ..ప్రదీప్ ని ఒక ప్రశ్న అడిగింది — “మీరు చూడటానికి అసలు హీరో లా లేరు..ఇంత క్రేజ్ మీకు రావడానికి కారణం మీ లెక్క వల్లే కదా?” అని సరదాగా అడిగిన ప్రశ్నతో, ఒక్కసారిగా హాల్‌లో సైలెన్స్ నెలకొంది.అయితే ప్రదీప్ రంగనాథన్ మాత్రం తనదైన స్టైల్‌లో చాలా కూల్‌గా, కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇచ్చాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
“బయట చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వారందరినీ నేను చూశాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, దానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది హార్డ్ వర్క్, రెండోది ప్రజల సపోర్ట్. చాలామంది వాళ్లను నాలో చూసుకుంటారు. అందుకే నా సినిమాలకు ఇంత క్రేజ్ వస్తుంది. వారు నా సినిమాలు చూస్తున్నప్పుడు — వాళ్ళే హీరోలమని ఫీల్ అవుతున్నారు. వాళ్ళే ఫైటింగ్ చేస్తున్నారు, వాళ్ళే లవ్ చేస్తున్నారు, వాళ్ళే డాన్స్ చేస్తున్నారు అని భావిస్తున్నారు. నా సినిమాలు చూసి వాళ్లు మురిసిపోతుంటారు. అలాంటి అభిమానులు ఉన్నంత వరకు నాకు ఏ సమస్యా ఉండదు. వాళ్లు నన్ను హీరోలా చూసుకుంటున్నప్పుడు — నేను ఇప్పటికే హీరోనే.”అని చెప్పిన ప్రదీప్ మాటలకు అక్కడి ప్రేక్షకులు చప్పట్లతో స్పందించారు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్న ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రదీప్ ఫ్యాన్స్ కామెంట్స్‌లో మునిగిపోతున్నారు —“ఇలానే సైలెంట్ కిల్లర్ నువ్వు!”“చెప్పుతో కొట్టినట్టే ఆన్సర్ ఇచ్చావ్ బ్రో!“ఈ జనరేషన్‌కి రియల్ రిప్రెజెంటేషన్ నువ్వే!”అంటూ ఘాటుగా ప్రశంసిస్తున్నారు. ఇక మరోవైపు, కొంతమంది సినిమా ప్రేమికులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు —“ప్రదీప్ రంగనాథన్ కేవలం నటుడు కాదు, ఒక అటిట్యూడ్. ఆయన నోటి దూకుడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆలోచన విధానం ఇవన్నీ కొత్త తరానికి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అందుకే ప్రతి సినిమా హిట్ అవుతుంది.”మొత్తం మీద ప్రదీప్ రంగనాథన్ “డ్యూడ్” ట్రైలర్ ఈవెంట్‌లో చెప్పిన ఒక్క సమాధానమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సైలెంట్ కిల్లర్ అటిట్యూడ్‌తో మళ్లీ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు ఈ యంగ్ స్టార్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి