టాలీవుడ్ నాచురల్ బ్యూటీగా పేరు పొందిన సాయి పల్లవి అందం, అభినయం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తమిళ, మలయాళ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. సాయి పల్లవి హీరోయిన్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా సహజమైన నటిగా పేరు సంపాదించింది. అందుకే టాలీవుడ్ లో ఈమెకు లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి చిన్న వయసు నుంచి డాన్స్ పైన చాలా ఆసక్తి ఉండేది, దీని ఫలితంగానే ఈమెకు సినిమాలలోని అవకాశాలు వచ్చాయనీ చెప్పవచ్చు.


తెలుగులో ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన సహజమైన నటనతో, డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. అలా ఎన్నో చిత్రాలలో నటించిన సాయి పల్లవికి తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన కలైమామణి అవార్డు అందించారు. ఈ అవార్డును నిన్నటి రోజున సాయంత్రం చెన్నైలో ఒక భారీ బహిరంగ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ చేతులమీదుగా ఈ అవార్డుని సాయి పల్లవి అందుకుంది. ఈ అవార్డు సాయి పల్లవి కెరియర్ లోని ఒక సరికొత్త గుర్తింపు లభించేలా చేస్తోంది.



ఈ గౌరవాన్ని 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను మొత్తం మీద 90 మంది కళాకారులకు ఇచ్చారు. ఇందులో ఎస్ జె సూర్యతో పాటు, విక్రమ్ ప్రభు మరికొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక ఈ విషయం విన్న  అభిమానులు వీరిని ప్రశంసిస్తూ పొగడ్తలతో ప్రశంసిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే మీరోరాహు అనే చిత్రానికి సంబంధించి ఇటీవల షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ లో రామాయణ మొదటి భాగంలో సీత పాత్రలో కనిపించబోతోంది. తెలుగులో అయితే చివరిగా నాగచైతన్యతో తండెల్ చిత్రం లో కనిపించింది.ప్రస్తుతమైతే తెలుగులో ఎలాంటి  సినిమా చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: