తెలంగాణ రాజకీయాలలో జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు చాలా కీలకంగా మారాయి. ఇలాంటి తరుణంలో పార్టీలు తమ తమ నేతలను అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతో అన్ని పార్టీల వారు ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గడిచిన కొంతకాలం అనారోగ్య సమస్యతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఆయన భార్య సునీతకు  టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించారు. తన తల్లి గెలుపు కోసం కూతుళ్లు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరిగి తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి తన తల్లికి  మద్దతిచ్చి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో పాల్గొన్న మాగంటి గోపీనాథ్ కూతుళ్లలో ఒకరికి కాలికి గాయమైన కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కాలికి కట్టు కట్టుకొని మరి ప్రచారం చేయడం ఇప్పుడు రాజకీయాలలో , ప్రజలలో అందరి మనసును కదిలించేలా చేస్తోంది. తండ్రి లేని లోటును భర్తీ చేయ లేకపోయినా తన తల్లికి అండగా నిలబడాలని దృడ సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. అందుకు సంబంధించి వీడియోలు వైరల్ గా మారడంతో నేటిజన్స్ భిన్నంగా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.


ముఖ్యంగా తండ్రి మరణించాక ఆ బాధను దిగమింగుకొని తల్లి గెలుపు కోసం కృషి చేయడం చాలా గొప్పదంటూ ప్రశంసిస్తున్నారు. మరి కొంతమంది ప్రత్యర్థులు మాత్రం ఇది కుంటి కాలు డ్రామా, రాజకీయాలలో భాగం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నవంబర్ 11వ తేదీన ఈ ఉపఎన్నిక జరగబోతోంది, నవంబర్ 14న కౌంటింగ్ జరిగి అభ్యర్థి ఎవరు గెలిచారనే విషయాన్ని ప్రకటిస్తారు. ఈనెల 13 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ నిలబడ్డారు, ఎంఐఎం ఈసారి పోటీ నుంచి తప్పుకుంది, బిజెపి అభ్యర్థిని ఇంకా ప్రకటించాలి. ఇలా ఎవరికి వారు అన్ని పార్టీల నాయకులు ఉప ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: