2023 ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన గుండెపోటు తో మరణించడంతో  ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ ఉప ఎన్నిక స్థానాన్ని ఎలాగైనా సంపాదించాలని బీఆర్ఎస్ పార్టీ తహతహలాడుతోంది. గోపీనాథ్ భార్య అయినటువంటి మాగంటి సునీతను రంగంలోకి దింపింది. ఇదే క్రమంలో మరోవైపు బలమైన పార్టీ అయినటువంటి కాంగ్రెస్, బీజేపీలు కూడా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ యాదవ్ అనే అభ్యర్థిని ప్రకటించింది. ఇక బిజెపి ఎవరిని ప్రకటించాలో తెలియక మల్ల గుల్లాలు పడుతుంది. 

ఇదిలా నడుస్తున్న తరుణంలో  బీఆర్ఎస్ అభ్యర్థి ని గెలిపించడానికి ఎలక్షన్ వీరులు రంగం లోకి దిగారు. ఎలాగైనా బీఆర్ఎస్ ను గెలిపించి  ప్రజల్లో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని పెంపొందించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి కేటీఆర్, హరీష్ రావు వచ్చి చేరారు. ఇప్పటికే డివిజన్ ల వారిగా  కేటీఆర్ మీటింగ్ లు పెడుతున్న సమయంలో హరీష్ రావు కూడా రంగంలోకి దిగారు. సభలు,సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులపై వివరిస్తున్నారు.

ఇదే తరుణంలో ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్ కూడా అక్కడ బలంగా పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ గెలిచిన ఆశ్చర్యపనక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే రెండు సార్లు అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది కాబట్టి ముస్లిం ఓట్లు కూడా నవీన్ యాదవ్ కి కలిసి వచ్చే అవకాశం ఉంది. దీన్ని గమనించినటువంటి హరీష్ రావు, కేటీఆర్ లు  రంగంలోకి దిగి మాగంటి సునీతని గెలిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 15న నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: