ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యూనరేషన్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఒకప్పుడు సినిమాకి 10, 20 కోట్లు పారితోషికంగా తీసుకునే హీరోలు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌లుగా మారడంతో 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో స్టార్ హీరో ఒక్క సినిమాకి తీసుకుంటున్న పారితోషికం చూసి నిర్మాతలు తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది టాప్ హీరోలు పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు చేస్తున్నారు. పెద్ద బడ్జెట్‌తో, భారీ సెట్‌లు, వందల కోట్ల విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రేజ్‌కి తగ్గట్టుగా హీరోలు తమ రెమ్యూనరేషన్ కూడా బిగ్ స్కేల్‌లో పెంచేసుకున్నారు. అయితే, ఈ రెమ్యూనరేషన్ ఫిగర్స్ చూసి నిర్మాతలు పరోక్షంగా బాధపడిపోతున్నారు.


"హీరోయిన్స్ కి 10 లేదా 12 కోట్లు ఇవ్వాలంటే మేకర్స్ వెనుకాడుతున్నారు, కానీ హీరోలకైతే 100 కోట్లు, 120 కోట్లు కూడా ఇస్తున్నారు" అంటూ పలువురు ప్రముఖ హీరోయిన్స్ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. “హీరోలతో పోలిస్తే మాకు ఇచ్చే రేంజ్ ఎంతో తక్కువ.. ఇక్వల్ వర్క్ చేసినా రివార్డ్ మాత్రం అసమానంగా ఉంది” అంటూ సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయాన్నే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ పేరు గ్లోబల్ లెవెల్‌లో మారుమ్రోగిపోతుంది. ఈ సమయంలో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.



సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు ₹770 కోట్లు అని సమాచారం. అందులో సుమారు ₹260 కోట్లు కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం మాత్రమే కేటాయించారని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించడానికి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ మొత్తం ఇండస్ట్రీలోనే రికార్డు స్థాయిలో ఉందని టాక్. ఆయనకు సుమారు ₹175 కోట్ల పారితోషికం ఫిక్స్ చేశారని సినీ వర్గాల సమాచారం. అలాగే హీరోయిన్ దీపికా పదుకొనేకి ₹15 కోట్లు ఫిక్స్ చేసినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఏ హీరోకీ ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇవ్వలేది.  ఇదే మొదటిసారి. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. కొంతమంది అభిమానులు “మన హీరో రేంజ్ ఏమిటో చుడండి!” అంటూ సంతోషం వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం “హీరోల రెమ్యూనరేషన్ ఇంతగా పెరిగిపోతే, ఆ భారం చివరికి టికెట్ ధర రూపంలో మన మీదే పడుతుంది” అంటూ తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.



ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఈ టాపిక్‌నే హాట్ చర్చగా మారింది. “హీరోల రెమ్యూనరేషన్ హద్దులు దాటిపోతే మేకర్స్ పరిస్థితి ఏంటి?”, “సినిమా బడ్జెట్‌లో సగం హీరోకే వెళ్తే సినిమాలు ఎలా ప్రాఫిట్‌లోకి వస్తాయి?” అంటూ ప్రేక్షకులు, విమర్శకులు, ఇండస్ట్రీ వర్గాలు ఒక్కటే ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క సినిమా బిజినెస్ అంతా హీరోల ఇమేజ్ మీద ఆధారపడి ఉందనేది నిజమే, కానీ మేకర్స్ భారం తట్టుకోలేని స్థాయికి పోతే ఇండస్ట్రీ స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుందనేది కూడా వాస్తవం. ఇక ఈ ట్రెండ్ ఎక్కడ ఆగుతుంది? నిర్మాతలు ఎప్పుడు లైన్ డ్రా చేస్తారు? అన్నది చూడాలి..???

మరింత సమాచారం తెలుసుకోండి: