సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల జీవితం బయటకి చూస్తే చాలా రాజభోగంగా, కలల జీవితంగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఆ గ్లామర్ వెనుక ఎన్నో బాధలు, విఫలాలు దాగి ఉంటాయి. చాలా మంది ప్రజలు అనుకుంటూ ఉంటారు .  స్టార్ హీరోలు, హీరోయిన్‌లకు డబ్బు ఎక్కువ, క్రేజ్ ఎక్కువ, సౌఖ్య జీవితం గ్యారంటీ అని. కానీ నిజజీవితంలో పరిస్థితి పూర్తిగా వేరు అని పలువురు సెలబ్రిటీలు తమ అనుభవాల ద్వారా నిరూపిస్తున్నారు.ఇటీవల అటువంటి సెలబ్రిటీ లిస్ట్‌లో చేరిన పేరు బాలీవుడ్ నటి, సింగర్ కునికా సదానంద్. తెలుగు ప్రేక్షకులకు ఆమె పేరు పెద్దగా పరిచయం కాకపోయినా, బాలీవుడ్‌లో మాత్రం మంచి గుర్తింపు ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్.  ఆమె స్మార్ట్‌గా మాట్లాడే తీరుతో, చురుకైన నడవడితో ఇండస్ట్రీలో అందరి మనసులు గెలుచుకుంది.ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హిందీ 19వ సీజన్‌లో పాల్గొనడంతో మళ్లీ స్పాట్‌లైట్‌లోకి వచ్చారు. రియాలిటీ షోలో కునికా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను బహిరంగంగా చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


ఆమె మాట్లాడుతూ —“నేను ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదు. కానీ నాకు మందు తాగే అలవాటు ఉంది. నా జీవితంలో బ్రేకప్ జరిగినప్పుడు చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ బాధను మర్చిపోవడానికి రోజూ విపరీతంగా తాగేదాన్ని. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ‘ఇలా చేయొద్దు’ అని ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. అలా అలవాటైపోయాను. బరువు పెరిగిపోయాను, ఆరోగ్యం క్షీణించింది. ఒకసారి డబ్బింగ్ చెప్పడానికి స్టూడియోకి వెళ్లి అద్దంలో నన్ను చూసుకున్నప్పుడు నాకు నేనే అసహ్యంగా అనిపించింది. అప్పుడే నేను ఎంత తప్పు చేశానో గ్రహించాను,” అని కునికా తెలిపారు.



అంతేకాకుండా తన ప్రేమ జీవితం గురించి కూడా ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడారు.“నా జీవితంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి, కానీ ఏదీ సక్సెస్ కాలేదు. నేను ఇద్దరితో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను, నలుగురితో ప్రేమ సంబంధాలు పెట్టుకున్నాను. కానీ ఎవరి దగ్గరా నాకు నిజమైన ప్రేమ దొరకలేదు. యాక్టర్స్‌ని నేను అస్సలు ప్రేమించలేదు, ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ అద్దంలో తమను తాము చూసుకుంటూ ‘మనం ఎంత అందంగా ఉన్నాం’ అని మురిసిపోతారు. అలాంటి వాళ్లతో కనెక్ట్ అవ్వడం వల్ల నాకే నష్టం జరిగింది,” అని ఆమె వ్యాఖ్యానించారు. కునికా మొదట పెళ్లి చేసుకున్న వ్యక్తితో అనేక విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు పుట్టాడు. కానీ వ్యక్తిత్వ భేదాల కారణంగా ఈ ఇద్దరూ కూడా విడిపోయారు.



ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ సాధించినా, పర్సనల్ లైఫ్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యానని కునికా ఓపెన్‌గా అంగీకరించారు.“జీవితంలో డబ్బు, పేరు, ఫేమ్ అంతా ఉన్నా — ప్రేమ, ప్రశాంతత లేకపోతే అది అసలు జీవితం కాదు. నేను ఈ నిజం చాలా ఆలస్యంగా గ్రహించాను,” అని ఆమె చెప్పిన మాటలు ఎంతో మందిని ఆలోచింపజేశాయి.ఇలా తన జీవితంలోని చేదు అనుభవాలను నిజాయితీగా చెప్పిన కునికా సదానంద్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, “ఇలా నిజాయితీగా చెప్పడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు” అని కామెంట్లు చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: