తెలిసి చేశాడో, తెలియక చేశాడో కానీ కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథ్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, ఈ విషయం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల్లోనూ పెద్ద సెన్సేషన్‌గా మారి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మనందరికీ తెలిసిందే .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఇది పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దశలవారీగా శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఇమ్మాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సినిమా మొదటి నుంచి మేకర్స్ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. ఎటువంటి సమాచారం లేదా లీక్ కూడా బయటకు రాకుండా కఠినంగా గోప్యత పాటిస్తున్నారు. ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా, అది మేకర్స్ చేతనే రావాలని వారు కండీషన్ పెట్టుకున్నారు.


అయితే తాజాగా, అనుకోకుండా పెద్ద లీక్ జరగడంతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. ఆ లీక్ చేసినది కూడా మరెవరో కాదు — కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్. ప్రదీప్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘డ్యూడ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఆ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు నాకు ప్రభాస్ సినిమా ‘ఫౌజీ’లోని కొన్ని సీన్స్ చూపించారు, వాటిని చూసి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను” అని చెప్పారు. ఇప్పటివరకు హను రాఘవపూడి గాని, ప్రభాస్ గాని — తమ సినిమా టైటిల్‌ని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ ప్రదీప్ మాత్రం తెలియకుండానే “ఫౌజీ” అని టైటిల్‌ను బయట పెట్టేశాడు. దాంతో ప్రభాస్ అభిమానులు షాక్ అయ్యారు. “ఇంత పెద్ద మూవీకి టైటిల్‌ని హీరోయే ఇలా లీక్ చేయడమేంట్రా బాబూ!” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ రేంజ్‌లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇక ఈ ఫౌజీ టైటిల్ లీక్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో వందలాది పోస్టులు, ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ అయితే — “ఇది నిజంగా సినిమా టైటిల్ అయితే, సూపర్‌గా ఉంది”, “హను స్టైల్లో ఉండే నేమ్ అనిపిస్తోంది” అంటూ రియాక్ట్ అవుతున్నారు.



మరోవైపు, ప్రదీప్ చేసిన ఈ అనూహ్య లీక్‌పై మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. కొందరు సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ లీక్ వేరే ఎవరైనా వ్యక్తి ద్వారా జరిగి ఉంటే ఇప్పటికి పెద్ద వివాదం అయ్యేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. “అది కూడా హీరో ప్రదీప్ కాబట్టి… మూవీ యూనిట్ సైలెంట్‌గా ఉంటోంది” అని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.ఇక మొత్తానికి చెప్పాలంటే — ప్రదీప్ రంగనాథ్ ఒక్క మాటతో ప్రభాస్ సినిమా ‘ఫౌజీ’అని సోషల్ మీడియా హైలైట్‌గా మార్చేశాడు. ఇప్పుడు అందరి దృష్టి హను రాఘవపూడి టీమ్ మీదే ఉంది — వాళ్లు నిజంగా ఈ టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేస్తారా, లేక కొత్త ట్విస్ట్ ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: