"ఈ ఏడాది భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన సినిమాలలో వార్ 2 ఒకటి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోలేక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా అంచనాలను మించి నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా ఫలితం గురించి మరోసారి హృతిక్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక ఈవెంట్ లో హృతిక్ రోషన్ మాట్లాడుతూ, "మీ అందరికీ ధన్యవాదాలు. నా లేటెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయినా సరే మీరు ఇంత ప్రేమ, అభిమానం చూపుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా" అని హృతిక్ రోషన్ తెలిపారు. హృతిక్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తమ సినిమా ఫలితం గురించి మాట్లాడేందుకు తారలు అంతగా ఆసక్తి చూపించరు.

 అలాంటిది ఏమాత్రం దాపరికాలు లేకుండా తన సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని హృతిక్ రోషన్ ఓపెన్ గా చెప్పడం చూసి ఆయన అభిమానులు మరింత మురిసిపోతున్నారు. తన నిజాయితీకి ఫిదా అయిన నెటిజన్లు సైతం హృతిక్ ను ప్రశంసిస్తున్నారు. నటుడిగా ఎంత సక్సెస్ అయినా, పరాజయాన్ని కూడా అంతే స్పోర్టివ్ గా తీసుకునే హృతిక్ లాంటి వారు అరుదుగా ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది."

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: