టి ఆర్ ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కెసిఆర్ కుమార్త కవిత చాలా సంవత్సరాల పాటు టి ఆర్ ఎస్ పార్టీ లో అత్యంత కీలకమైన నేతగా కొనసాగింది. ఇక కవిత కొంత కాలం క్రితం బీ ఆర్ ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చింది. ఆ పార్టీ నుండి బయటకు వచ్చాక ఆ పార్టీ కి సంబంధించిన కొంత మంది నేతలపై కూడా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక దాని తో ఈమె బీ ఆర్ ఎస్ పార్టీ నుండి కంప్లీట్ గా బయటకు వచ్చేసినట్లే ఇక ఈమె మళ్లీ బీ ఆర్ ఎస్ పార్టీ లోకి వెళ్లే అవకాశాలు ఏ మాత్రం లేవు అని చాలా మంది భావించారు.

అలాంటి సమయం లోనే తెలంగాణ రాష్ట్రం లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ , ప్రస్తుత ప్రధాన ప్రతి పక్ష పార్టీ అయినటువంటి బీ ఆర్ ఎస్ అలాగే బీ జే పీ పార్టీ లు పెద్ద ఎత్తున గెలుపు కోసం అనేక ప్రచారాలను నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. ఇక ఈ రోజు మొదటి నుండి కూడా కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీ హిల్స్ ఓపెన్ ఎన్నికలలో లీడింగ్ లో కొనసాగుతూ వచ్చాడు.

దానితో చివరగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందాడు. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ఓటమి చెందింది. బీ ఆర్ ఎస్ ఓటమి పాలయిన వేల కవిత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ప్రస్తుతం సంచలనగా మారింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా బీ ఆర్ ఎస్ ఓటమి చెందిన వేల కవిత కర్మ హిట్స్ బ్యాక్ అంటూ దండం పెట్టే ఎమోజీలతో ఓ పోస్ట్ చేసింది. దానితో కవిత తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: