కొన్ని రోజుల క్రితం బీహార్ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలి అని బి జె పి , కాంగ్రెస్ రెండు పార్టీ లు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలను చేశాయి. ఇక బి జె పి పార్టీ లోని ఎంతో మంది కీలక నేతలు బీహార్ లో పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహించారు. ఇక కాంగ్రెస్ వారు కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ లోని అత్యంత కీలక నేతలు కూడా బీహార్ లో పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహించారు. దానితో బీహార్ ప్రజలంతా ఈ ప్రాంతంలో ఏ పార్టీ వారు గెలుపొందుతారా అనేది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. కేవలం బీహార్ ప్రజలు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలు బీహార్ రాష్ట్రం లో ఎవరు గెలుపొందుతారా అనేది ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

ఇకపోతే ఈ రోజు అనగా నవంబర్ 14 వ తేదీన బీహార్ రాష్ట్రం లో కొన్ని రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. ఇక ఈ ఫలితాలలో ఎన్డీఏ అదిరిపోయే రేంజ్ లో ముందుకు దూసుకు పోయింది. దానితో కొన్ని రోజుల క్రితం ప్రధాన మంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కొంత కాలం క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ బీహార్ లో ఎన్డీఏ అతి పెద్ద విజయం సాధిస్తుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే నవంబర్ 14 వ తేదీన విజయోత్సవానికి సిద్ధం కండి అని ఆయన పిలుపునిచ్చాడు. ఆయన చెప్పినట్లు గానే బి జె పి అఖండ విజయం వైపు కు దూసుకుపోతూ ఉండడంతో ప్రచారాల వేల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: