కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం లోనే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో ఉప ఎన్నికలు జరిగిన విషయం మన అందరికి తెలిసిందే. ఇకపోతే బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. మొదట బీహార్ లో జరిగిన ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలను గెలుపొంది అక్కడ విజయ డంకా మోగించాలి అని కాంగ్రెస్ నేతలు భావించారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గెలుపొంది తమ సత్తా ఏంటో మరో సారి నిరూపించుకోవాలి అని కూడా కాంగ్రెస్ నేతలు భావించారు.

కొంత కాలం క్రితం బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అన్ని ఈ రోజు అనగా నవంబర్ 14 వ తేదీన ఎన్నికల సంఘం వారు విడుదల చేశారు. ఆ ఫలితాలలో భాగంగా బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ కి భారీ ఓటమి ఎదురైంది. బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవడంలో అత్యంత వెనుకబడిపోయింది. ఇకపోతే జూబ్లీ హిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ ఓట్లను దక్కించుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ విజయాలపై బీ జే పీ పార్టీ నాయకుడు అయినటువంటి కిషన్ రెడ్డి తాజాగా స్పందించారు. తాజాగా ఈయన మాట్లాడుతూ ... దేశ ప్రజలు కాంగ్రెస్ కి మంగళం పాడేశారు అని బీహార్ ఎన్నికల ఫలితాల ద్వారా జనాలకు తెలిసిపోయింది అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. జూబ్లీ హిల్స్ లో తాము ఎప్పుడూ కూడా గెలవలేదు అని , ఉప ఎన్నికలలో కాంగ్రెస్ డబ్బులు ఇచ్చి గెలుపొందింది అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈవీఎం లపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ జూబ్లీ హిల్స్ గెలుపు పై సమాధానం చెప్పాలి అని కిషన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: