జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. సమీప గులాబీ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే ఓటములనే మెట్లుగా చేసుకుని ఈరోజు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 యూసఫ్ కూడా డివిజన్ నుంచి ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా నిలిచి తెలుగుదేశం అభ్యర్థి మురళి గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఎంఐఎం నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి 41 వేల ఓట్లు తెచ్చుకొని రెండో స్థానంలో నిలిచారు. అలాగే 2015లో మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు.
అలాగే 2018 లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 19 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఇలా మొత్తం నాలుగు సార్లు రెండుసార్లు కార్పొరేటర్ గా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగు సార్లు ఓడిపోయారు. అయినా కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానికుడు గా మంచి ముద్ర వేసుకున్నారు. చివరకు 2023 సాధారణ ఎన్నికలకు నెల రోజులు ముందు నవంబర్ 15న అప్పటి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పట్నుంచి కొనసాగుతున్నారు. 42 సంవత్సరాల వయసు ఉన్న నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్. భార్య పేరు వర్ష, కుమారుడు అన్ష్ యాదవ్. యూసఫ్‌గూడలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి