జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ద్వారా పార్టీపై ప్రజల విశ్వాసం మరింతగా పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన అనంతరం, విజయం సంతోషం నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు .. ఆ మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి. .జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పార్టీ విజయయాత్రను మరో అడుగు ముందుకు తీసుకెళ్లిందని ఆయన అన్నారు ..


రేవంత్ రెడ్డి మాట్లాడుతూ—అసెంబ్లీ ఎన్నికల అనంతరం హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల నమ్మకం రోజురోజుకు పెరుగుతుందని అన్నారు. ప్రజలు చూపిన విశ్వాసం, కాంగ్రెస్ నాయకత్వంపై చూపిన ప్రేమ, అభిమానం ఈ విజయానికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. “ప్రజలు మా పనితీరును గమనిస్తున్నారు. మా ప్రభుత్వం రెండు సంవత్సరాలపాటు చేపట్టిన కార్యకలాపాలను, సంక్షేమ కార్యక్రమాలను నిశితంగా పరిశీలించి మాకు ఈ తీర్పు ఇచ్చారు. ఈ విజయం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యతను మరింత పెంచింది” అని సీఎం పేర్కొన్నారు ..



జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్‌కు ఒగ్గిన భారీ మెజార్టీ తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు  ... ఈ సందర్భంగా విజయం అందించిన జూబ్లీహిల్స్ ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే విజయం కోసం కష్టపడ్డ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, ప్రజలకు మరింత చేరువయ్యే విధానాలపై ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటామని సీఎం తెలిపారు. జూబ్లీహిల్స్ విజయం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని మరింత బలపరుస్తుందన్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: