ఏ రాష్ట్రం లో అయినా ఎన్నికలు జరగబోతున్నా యి అంటే దాదాపు ఆ రాష్ట్రా లలో ఆ పా ర్టీ కి సంబంధించిన ప్రధాన నేతలు పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కార ణం ఆ పార్టీ కి సంబంధించిన ప్రధాన నేతలు గనుక ఎన్నికలు జరిగే ప్రదేశాలలో ప్రచారాలను నిర్వ హించినట్లయితే ఆ ఎన్నికలలో ఆ పార్టీ లు గెలుపొందే అవకాశం ఉంటుంది అని వారు భావించడమే అందుకు ప్రధాన కారణం. ఇకపోతే తాజాగా బీహార్ రాష్ట్రం లో ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహించాడు. ఈయన బీహార్ రాష్ట్రంలో ఓటర్ అధికారి యాత్ర అనే పేరుతో 25 జిల్లాల్లో పెద్ద ఎత్తున పర్యటించారు.

ఇందులో ఈయన 110 నియోజకవర్గాలను కవర్ చేసారు. ఇలా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున బీహార్ రాష్ట్రంలో ప్రచారాలను నిర్వహించడం , ఎన్నో నియోజకవర్గాలలో ప్రచారాలను నిర్వహించడంతో ఈయన ప్రచారాల కారణంగా కాంగ్రెస్ పార్టీ కి చాలా ఓట్లు పడతాయి అని , అనేక అసెంబ్లీ స్థానాలు లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారు అని చాలా మంది విశ్లేషణ చేశారు. కానీ వారి విశ్లేషణ చాలా వరకు రాంగ్ అయింది. ఈ రోజు అనగా నవంబర్ 14 వ తేదీన బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలు దక్కడం కష్టంగా కనబడుతుంది. దానితో చాలా మంది రాహుల్ గాంధీ తాజాగా బీహార్ ఎలక్షన్లలో గెలుపు కోసం ఎంతో కష్ట పడ్డారు. కానీ ఆయన కష్టం పెద్దగా ఫలించలేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: