కేసు దాఖలు చేశారు. అయితే, ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది! టీటీడీ అనుమతి లేకుండానే సతీష్ కుమార్.. నిందితుడు రవికుమార్‌తో లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవడంపై అనేక అనుమానాలు రేగాయి. ఈ రాజీ వ్యవహారంపై కొందరు భక్తులు కోర్టుకు వెళ్లడంతో.. హైకోర్టు జోక్యం చేసుకుని, అసలు రాజీ వెనుక ఉన్న కుట్రను తేల్చేందుకు సిట్ (SIT) విచారణకు ఆదేశించింది! ఈ సిట్ దర్యాప్తు జరుగుతుండగానే.. ఈ నెల 6న విచారణను ఎదుర్కొన్న సతీష్ కుమార్.. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో రైలు పట్టాలపై మృతదేహమై కనిపించడం అతిపెద్ద సంచలనం. ఎవరు ఒత్తిడి చేశారు? రహస్యం రైల్లోనే పోయిందా? .. పరకామణి కేసు రాజీ వెనుక ఎవరు ఉన్నారు? సతీష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చింది ఎవరు? అనేది తేలడానికి ఆయనే కీలక సాక్షిగా ఉన్నారు.
స్వయంగా సతీష్ కుమార్ సైతం.. అప్పట్లో పోలీసులు ఒత్తిడి చేయడం వల్లే రాజీ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి కీలక సమయంలో.. కేసు చిక్కుముడి వీడకుండా, సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మరణించడం అనేక సందేహాలకు తావిస్తోంది. "పరకామణిలో డబ్బులు మాయం వెనుక ఉన్న పెద్ద తలలు ఎవరిని రక్షించడానికి ఈ రాజీ జరిగింది? ఇప్పుడు సతీష్ కుమార్ మరణం వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటి?" అని భక్తులు, విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ మృతి కేవలం ప్రమాదమా, లేక 'సాక్షిని మాయం' చేసే కుట్ర జరిగిందా? అన్నది తక్షణమే తేలాల్సిన అవసరం ఉంది. లేకపోతే, టీటీడీ పవిత్రతపై, వ్యవస్థలపై ఉన్న విశ్వాసం పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఈ కేసులో నిజాలు బయటపడాలంటే.. సమగ్ర దర్యాప్తు జరిపితీరాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి