అయితే గత ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు కూటమిలో భాగంగా చాలా కీలకమైన పాత్ర పోషించినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తన తండ్రి నెలకొల్పిన పార్టీని కోల్పోయిన చిరాగ్ వరుస ఎన్నికలలో సత్తా చాటుతూ వచ్చారు. 2020 ఎన్నికలలో నితీష్ నాయకత్వాన్ని చిరాగ్ వ్యతిరేకించారు.. కాని ఎన్డిఏలో బిజెపి పార్టీకి మద్దతిస్తూ 137 స్థానాలను తన పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెట్టారు. కానీ ఆ ఎన్నికలలో కేవలం ఒక్క సీటు మాత్రమే పరిమితమైంది. కానీ JDU ఓట్లకు మాత్రం పెద్ద దెబ్బ కొట్టడంలో కీలకమైన పాత్ర పోషించారు చిరాగ్.
2015లో 71 సీట్లను సాధించిన జేడీయూ పార్టీ చిరాగ్ దెబ్బతో 2020లో 43 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత కుటుంబ కలహాలతో విభేదాలు రావడంతో ఎన్నికల సంఘం కూడా పార్టీ గుర్తుని హొల్డ్ లో పెట్టిందట. కానీ 2021లో LJP (రాం విలాస్) పేరిట సరికొత్త పార్టీని మొదలుపెట్టారు. తన బాబాయ్ నుంచి ఎదురు దెబ్బతిన్న చిరాగ్ బీహార్ ప్రజలకు యువ బిహారి అంటూ చేరువయ్యారు. తండ్రి వారసత్వం నుంచి దళిత నాయకుడిగా పైకి ఎదిగి అలా 2024 లోక్సభ ఎన్నికలలో పోటీ చేసి 5 స్థానాలలో మంచి విజయాన్ని అందుకోగా 100% స్ట్రైక్ రేట్ అందుకున్నారు. దీంతో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమశాఖ మంత్రిగా కూడా బాధ్యతలను చేపట్టారు.. ఇప్పుడు తాజా ఎన్నికలలో 29 చోట్ల పోటీ చేయగా LJP 22 స్థానాలలో ఆదిత్యంలో ఉన్నారు. 75% స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్న ఈ పార్టీని చూసి చాలామంది రాజకీయ విశ్లేషకులు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విజయంతో పోలుస్తున్నారు.. 2029 ఎన్నికలలో మోదీని మళ్లీ ప్రధాని చేయడమే లక్ష్యం అంటూ తన విధేయతను చాటి చెప్పారు. బీహార్ లో కూడా తనని అత్యున్నత స్థానంలో చూడాలని తమ కార్యకర్తలు కోరుకుంటున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చిరాగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి