అయితే, ఇక్కడే నితీష్ ఒక అడుగు ముందుకేశారు! బాబు నాలుగు సార్లు సీఎం అయితే.. నితీష్ కుమార్ ఇప్పుడు ఐదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో నితీష్.. చంద్రబాబు పేరిట ఉన్న రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది! ఆ నినాదమే గేమ్ ఛేంజర్!.. నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ (JDU) ఈ ఎన్నికల్లో అద్భుతమైన ప్రభంజనం సృష్టించింది. పాలనపై పట్టు తప్పిందని, వయసు మీద పడిందని, మానసికంగా అలసిపోయారని ప్రత్యర్థులు చేసిన విమర్శలను నితీష్ ఒంటిచేత్తో తిప్పికొట్టారు. ఈ విజయం వెనుక ఉన్న బలమైన నినాదం.. 'టైగర్ అభీ జిందా హై' (పులి ఇంకా బతికే ఉంది!). రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్లోగన్ జేడీయూ శ్రేణులను ఉర్రూతలూపింది.
దాదాపు ఏడున్నర పదుల వయసులో ఉన్నా, తన పండిన రాజకీయ అనుభవంతో అద్భుతమైన విజయాన్ని సాధించి.. 'టైగర్' అంటే తానే అని నిరూపించుకున్నారు! యాంటీ ఇంకెంబెన్సీని సైతం తుత్తునియలు చేస్తూ.. జేడీయూ 101 స్థానాలకు పోటీ చేస్తే 80కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండడం నితీష్ చరిష్మాకు నిదర్శనం! ఈ నెల 15 లేదా 18 తేదీలలో నితీష్ కుమార్ మరోసారి సీఎం గా ప్రమాణం చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అనుకున్న ముహూర్తానికే నితీష్ ప్రమాణం చేస్తే.. రాజకీయ చాణక్యుడి వ్యూహం అపజయం లేకుండా పూర్తయినట్లే! అందుకే.. భారత రాజకీయాల్లో నితీష్ చాణక్యానికి తిరుగులేదంటూ రాజకీయ విశ్లేషకులు కితాబిస్తున్నారు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి