బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమిదే అధికారం. 243 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి 202 స్థానాలలో ఆదిత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కేవలం 31 స్థానాలకి పరిమితమైంది. ఈ క్రమంలోనే బీహార్ తదుపరి సీఎం ఎవరు? అనే అంశంపై ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కార్యకర్తలు, నేతలు భావిస్తున్నారు. కానీ ఈ క్రమంలోనే బీహార్ సీఎం నితీష్ కాదని సంకేతాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి.


ఈ రోజున బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసిన వెంటనే కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ ప్రభుత్వం రాబోతోందని అందుకు బీహార్ సిద్ధంగా ఉందంటూ జెడియూ వరుసగా పోస్టులను షేర్ చేసింది.జెడియూ ఈ రోజున ట్విట్ చేస్తూ సీఎంగా నితీష్ కుమార్ కొనసాగుతారంటూ తెలియజేశారు. అలా షేర్ చేసిన కొన్ని నిమిషాల తరువాతే ఆ పోస్టును తొలగించారు. దీంతో ఇప్పుడు బీహార్ సీఎం ఎవరు? అనే విషయంపై మరింత ఉత్కంఠత పెరిగిపోతోంది.


సీఎం నితీష్ నాయకత్వంలోనే ఎన్నికలలో పోటీ చేశామంటూ బిజెపి చెబుతోంది. మరొకవైపు మహారాష్ట్ర తరహా పాలిటిక్స్ ను బీహార్ అప్లై చేయాలని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లుగా అక్కడ  రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు. 2024 మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమిలో శివసేనకు చెందిన ఏక్ నాథ్ సిండే సీఎంగా ఎన్నికలకు వెళ్లారు, అయితే అక్కడ కాషాయ పార్టీ ఆధిపత్య ప్రదర్శన వల్ల చివరికి ఆ పదవి దేవేంద్ర ఫడ్నవీస్ చేరింది. ఇప్పుడు కూడా అలాగే బీహార్లో ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరిని సీఎం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జెడియూ సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు సీఎంగా సామ్రాట్ ప్రమాణ స్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: