( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో భారతీయ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసిన మాగంటి సునీత గోపీనాథ్ ఓటమి పాలయ్యారు. వాస్తవంగా ఈ ఉప ఎన్నికలలో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించింది. సునీత భర్త గోపీనాథ్ ఇక్కడ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో తెలుగుదేశం నుంచి తర్వాత రెండు ఎన్నికలలో భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఆయన వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గోపీనాథ్ మరణం తర్వాత ఆయన భార్య సునీతను గులాబీ పార్టీ పోటీకి పెట్టడంతో సానుభూతితో పాటు మహిళా అస్త్రం సెంటిమెంట్ అన్నీ కలిసి వస్తాయని ఆ పార్టీ భావించిన అంచనాలు తలకిందులు అయ్యాయి. .


ఓటమి తర్వాత సునీత మీడియాతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలలో నైతిక విజయం తనదే అని తెలిపారు. ఓ మహిళపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు అందరూ దౌర్జన్యం చేసి గెలిచారని ఆమె ఆరోపించారు. నియోజకవర్గంలో షేక్పేట - యూసఫ్ గూడ తో పాటు చాలాచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసి ఓటర్లను భయపెట్టి పోలింగ్ను మేనేజ్ చేశారని ఆమె ఆరోపించారు. ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదని ... రిగ్గింగ్ రౌడీలతో వచ్చిన విజయం అని సునీత మండిపడ్డారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: