జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో భారతీయ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసిన మాగంటి సునీత గోపీనాథ్ ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏకంగా 25 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కనీసం గట్టి పోటీ అయిన ఇస్తుందని అందరూ అనుకుంటే అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు ఇంత ఘోరంగా పడిపోయింది ? ఇందుకు ప్రధాన కారణాలు ఏమిటి అన్నది విశ్లేషించుకుంటే కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసిఆర్ ప్రచారానికి రాకపోవడంతో పార్టీ కార్యకర్తలలో నిరాశ , నిస్పృహలు అలుముకున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న అవి మాస్ జనం పట్టించుకోలేదు. బస్తీలకి ఈ ప్రచారం చేరలేదు.
మరి ముఖ్యంగా స్థానికంగా మంచిపట్టున్న నవీన్ యాదవ్ సామర్థ్యాన్ని గులాబీ పార్టీ అంచనా వేయలేకపోయింది. అలాగే చివరి ఐదు రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు విఫలమయ్యారు. ఈ విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేసారని చెప్పాలి. ఇక బిఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ముందుగానే ప్రకటన చేసిన సింపతితో పాటు మహిళా సెంటిమెంట్ తమకి కలిసి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇది ఎంత మాత్రం కలిసి రాలేదు. అయితే చివరిలో మాగంటి ఫ్యామిలీలో కలహాలు బయటకు రావటం మైనస్ అయ్యింది. గోపీనాథ్ తల్లి , గోపీనాథ్ మొదటి భార్య కొడుకు స్టేట్మెంట్ ఇవ్వటం ఎదరు దెబ్బ తగిలినట్లయ్యింది. ఇక సునీత కూడా ప్రచారంలో దూసుకు పోలేక పోవడం ఆమె గులాబీ పార్టీ కేడర్ను సైతం ఆకట్టుకోలేకపోవటం అటు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలో ఉండటం ఇవన్నీ గులాబీ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి