
ఆర్. చంద్రు మాట్లాడుతూ —“నేను 2023లో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా కబ్జా సినిమాను రూపొందించాను. ఆ సినిమా తీసిన విధానం, స్క్రీన్ ట్రీట్మెంట్, డైలాగ్స్ అన్నీ ఒక ప్రత్యేకమైన స్టైల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు చూసినప్పుడు ఓ జీ సినిమాలో చాలా సీన్స్, విజువల్ ప్రెజెంటేషన్, డైలాగ్స్ నా సినిమాను పోలిన విధంగానే కనిపిస్తున్నాయి. మీరు రెండు సినిమాలను ఒకసారి చూసి తేడా ఉందో లేదో మీరే చెప్పండి!”అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాయి.
అయితే, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను పూర్తిగా తిరస్కరించారు. “ఓ జీ సినిమాకి కబ్జా సినిమాకి ఎక్కడా పొంతనే లేదు. స్క్రిప్ట్, స్టోరీ, డైరెక్షన్, ప్రెజెంటేషన్ — అన్నీ పూర్తిగా భిన్నం” అని సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తూ తమ హీరోకి మద్దతు తెలుపుతున్నారు.ఇక మరోవైపు కొంతమంది నెటిజన్లు మాత్రం కావాలనే పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ, సినిమాని నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. “ఇది అంతా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలనే కుట్ర. ఒక విజయవంతమైన సినిమాలో ఇలా కాపీ అంటూ నిందలు వేయడం సరైంది కాదు” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
ఇంకా కొందరు యూజర్లు మాత్రం ఆర్. చంద్రు వ్యాఖ్యలతో అంగీకరిస్తూ, “పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా బ్లైండ్‌గా బిహేవ్ అవుతున్నారు. కాపీ స్పష్టంగా కనిపిస్తోంది” అని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ వివాదం రోజు రోజుకీ మరింత వేడెక్కుతోంది.అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఒక్క ఇంచ్ కూడా వెనక్కి తగ్గడం లేదు. “మా పవన్ కళ్యాణ్ సినిమా ఓ జీ కాపీ కాదు, ఇది ఒరిజినల్ మాస్టర్‌పీస్. బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొట్టడమే దానికి ప్రూఫ్!” అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్స్‌తో (#OGBlockbuster #PowerStarOG) ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. వారి మాటల్లో చెప్పాలంటే…“పవర్ స్టార్ సినిమా అంటే అది కాపీ కాదు, అది లెజెండ్!”