
ఈ చిత్రానిని 770 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడనుందని సమాచారం. అట్లీ సినిమాలు ఎప్పుడూ గ్రాండియర్, స్టైల్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలయికగా ఉంటాయి. అలాంటి డైరెక్టర్‌తో అల్లు అర్జున్ పనిచేయడం అంటే పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలన చిత్రానికి నాంది పలకడం లాంటిదే. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణేను ఇప్పటికే ఫైనల్ చేసేసారు. దీపికా ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రఖ్యాత నటి. ఆమెకి దేశవ్యాప్త గుర్తింపు ఉంది. బన్నీతో ఆమె జోడీగా కనిపించడం అంటే అంచనాలు రెట్టింపు కావడం ఖాయం. అంతే కాకుండా ఈ సినిమాలో మొత్తం ఐదు మంది గ్లామరస్ బ్యూటీస్ నటించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వారిలో జాన్వీ కపూర్, రష్మిక మందన్న, రుక్మిణి , కీర్తి సురేష్ పేర్లు ఇప్పటికే చర్చలోకి వచ్చాయి. వీరితో పాటు మరో ప్రత్యేక హీరోయిన్ కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుందట.
ఇక ఈ చిత్రంలోని స్పెషల్ ఆకర్షణ ఏంటంటే — పూజా హెగ్డే. అల్లు అర్జున్‌కు పూజా హెగ్డేతో ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “దువ్వాడ జగన్నాథం” , అలా వైకుఠపురంలో .. సినిమాతో వీరిద్దరి జంట తెరపై మ్యాజిక్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ కూడా కొనసాగుతోందని చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం, అట్లీ దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ సినిమాలో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ కోసం సైన్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీతో మళ్లీ ఒకసారి స్క్రీన్‌పై స్టెప్స్ వేయబోతున్న పూజా హెగ్డే ఇప్పటికే “ఓకే” చెప్పిందట.
ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానులు “వన్స్ మోర్ బన్నీ అండ్ పూజా హెగ్డే కాంబినేషన్!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట తెరపై కనిపిస్తే మళ్లీ థియేటర్లు బ్లాస్ట్ అవుతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ 2026 ఆరంభంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, నటీనటుల పూర్తి జాబితా, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.మొత్తానికి, “పుష్ప 2” తర్వాత అల్లు అర్జున్ కెరీర్‌లో మరో పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్‌గా అట్లీ దర్శకత్వం వహించే ఈ సినిమా బాక్స్ ఆఫిస్ రికార్డ్లు బ్లాస్ట్ చేస్తుంది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఇప్పుడు అభిమానులు మాత్రం ఒకటే చెబుతున్నారు — “వన్స్ మోర్ పూజా హెగ్డే విత్ బన్నీ… సూపర్ ఫైర్ గ్యారంటీ!” ఇదే వార్తపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సినీ వర్గాలు ధృవీకరించాయి.