- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపికైంది. తాజాగా ఆమె సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం ఈ వివరాలు ప్రకటించింది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలోకి శ్రీనిధి శెట్టిని స్వాగతిస్తూ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కేజీఎఫ్ సినిమాలతో ఆకట్టుకున్న శ్రీనిధి నేరుగా ఇప్పటికే తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. నాని హిట్ త్రి సినిమాతో పాటు సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలలో నటించింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది. ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రితం నటించిన నువ్వు నాకు నచ్చావ్ ఆ తర్వాత చేసిన మల్లేశ్వరి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలుకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వెంకటేష్ తో తెరకెక్కిస్తున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం.
ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని గత పది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతుంది. ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న 77వ సినిమా ఇది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.