
దీంతో వేణు స్వామి పైన మహిళా కమిషన్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా ఎన్నో చిక్కుల్లో పడ్డ వేణు స్వామి గడచిన కొద్దిరోజుల పాటు సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన ఒక వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేశారు. బిగ్ బాస్ షో గురించి వేణు స్వామి వీడియోని షేర్ చేస్తూ తెలుగు రాష్ట్రాలు ,తెలుగు మీడియా, తెలుగు సోషల్ మీడియా లో ఎక్కువగా నేను చూసిన వాటిలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ షో అని బ్యాన్ చేయాలని కంప్లైంట్ ఇస్తున్నారు. ఓకే అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం అంటూ తెలిపారు. ఎవరైతే సోషల్ మీడియా సెలబ్రిటీలుగా ఉన్నారో వారు కూడా హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుందంటూ తెలిపారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఉన్న ఐదుగురు ఇంచుమించు ముగ్గురు కాంట్రవర్సీ, ఇద్దరు డ్రెస్ కేసులో అరెస్ట్ అయిన వారు ఉన్నారు.. వాళ్ళ టిఆర్పి రేటింగ్, వ్యూస్ కోసం మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా విమర్శిస్తుంటారని కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారంటేనే మీ జాతకం చాలా బాగుందని అర్థం అంటూ తెలిపారు. వీళ్ళు చేసే ట్రోలింగ్ వల్ల మీరు కూడా ముందుకు వెళ్ళబోతారని ,అలాగే మీరు స్టార్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, బిగ్ బాస్ లో కూడా కనిపించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని తెలియజేస్తున్నారు వేణు స్వామి. అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.