ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఉపాసన రెండో ప్రెగ్నెన్సీ న్యూస్‌నే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.  ఇప్పుడు సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో — ఈ వార్త ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారని గుడ్ న్యూస్ చెప్పగానే, అందరి మనసుల్లో ఒకే ప్రశ్న మొదలైంది — “ఈ సారి పాప పుట్టబోతుందా? లేక బాబు పుట్టబోతున్నాడా?” అని. ఎందుకంటే ఆల్ రెడీ ఉపాసన కి పాప ఉంది..ఈసారి మనవడు కావాలి అని చిరంజీవి కూడా పలు సంధర్భాలల్లో బయట పెట్టాడు. అప్పట్లో అది పెద్ద రాధ్హంతం గా కూడా మారింది.  అయితే ఆ తర్వాత ఉపాసన తల్లి వెల్లడించిన విషయంతో ఆనందం మరింత రెట్టింపు అయింది.

ఉపాసన అమ్మగారు వెల్లడించిన దాని ప్రకారం.. ఉపాసనకు ఈసారి కవలలు (ట్విన్స్) రాబోతున్నారు. ఈ వార్త వినగానే మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు, అభిమానులు కూడా సంతోషంతో ఉప్పొంగిపోయారు. అందుకే ఉపాసన “డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ బ్లెస్సింగ్స్” అంటూ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయి, అభిమానుల హృదయాలను తాకింది. ఇప్పుడు అందరి మనసులో కొత్త ప్రశ్న – ఉపాసనకు ఎన్ని నెలలు అయ్యాయి? ఆమె ఎప్పుడు బిడ్డలకు జన్మనివ్వబోతున్నారు? అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, ఉపాసనకు ప్రస్తుతం మూడు నెలలు పూర్తయ్యి నాలుగో నెల మొదలయ్యిందట.

అలా అయితే, లెక్కలు సరిపెడితే — రామ్ చరణ్ పుట్టినరోజు సమయానికి ఉపాసన తన కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని చెబుతున్నారు. ఇదంతా నిజమైతే దేవుడు రాసిన స్క్రిప్ట్ లాంటిదే అని అభిమానులు అంటున్నారు. ఇన్నాళ్లు “మెగా వారసుడు ఎప్పుడు వస్తాడు?” అని ఎదురు చూసిన మెగా అభిమానులకు ఇది నిజంగా ఆనందకరమైన విషయం. ఈసారి ఒకరు కాదు — ఇద్దరు మెగా వారసులు రాబోతున్నారు అన్న వార్తతో సోషల్ మీడియా అంతా సెలబ్రేషన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయింది.మెగాస్టార్ చిరంజీవి కూడా ఎప్పటినుంచో తన మనవడు లేదా మనవరాలు కోసం ఎదురుచూస్తున్నారని తెలిసిందే. ఇప్పుడు ఆయన కోరిక కూడా నెరవేరబోతోందన్న ఆనందంతో అభిమానులు సోషల్ మీడియాలో “మెగా ఫ్యామిలీకి ఇది డబుల్ ఫెస్టివల్!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఉపాసన రెండో ప్రెగ్నెన్సీ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రతి ఒక్కరు మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: