ప్రముఖ నటి,కన్నడ బిగ్ బాస్ ఫేమ్ దివ్య సురేష్ తాజాగా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల ప్రారంభంలో ఈమె బెంగళూరులో తనకారుతో బైక్ ను ఢీ కొట్టి అక్కడి నుంచి పరారైనట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేస్ ఈమె మీద నమోదైనట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే అక్టోబర్ 4వ తేదీన తెల్లవారుజామున 1:30 నిమిషాలలో బైతరామణాపురలోని నిత్య హోటల్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అధికారులు.


దివ్య కారు ఒక బైక్ ను ఢీ కొట్టి అక్కడ నుంచి ఆగకుండా వెళ్ళిపోయేదని, దీంతో ఆ బైక్ పైన ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి ఈ క్రమంలోనే వారి యొక్క బంధువులు(కిరణ్) సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో బైకు మీద వెళ్తున్న అనూష (33), అనిత (24) కలిసి బైక్ పై వెళ్తుండగా వేగంగా ఒక నలుపు రంగు కారు వచ్చి వెనకనుంచి వారిని ఢీ కొట్టిందని, దీంతో వీరు ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయారని ఈ ఘటనలో అనితకు తీవ్రంగా గాయాలయ్యాయని ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు.


అలాగే అనుషకు కూడా స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. వీరిద్దరి చికిత్సలో బిజీగా ఉండడం చేత ఫిర్యాదు చేయడం కొంతమేరకు ఆలస్యం అయ్యిందని వెల్లడించారు. దీంతో నటి దివ్య సురేష్ కు వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులను జారీ చేసినట్లుగా తెలుస్తోంది పోలీసులు. పలు రకాల సీసీటీవీ కెమెరాలలో రికార్డయిన ఫుటేజ్ లలో కూడా ఈ కారు బైక్ను ఢీ కొట్టి పారిపోతున్న దృశ్యాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా నటి దివ్య సురేష్ వాహనమని అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతమైతే ఈ కేసు పై దర్యాప్తు జరుగుతోంది. మరి ఈ విషయం పైన నటి దివ్య సురేష్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: