ఇప్పటికే ఆయన సొంతంగా ఏర్పాటు చేసిన “సుకుమార్ రైటింగ్స్” అనే నిర్మాణ సంస్థ నుంచి విడుదలైన సినిమాలు వరుస విజయాలను నమోదు చేశాయి. ఈ విజయాలతో సుకుమార్ ప్రొడక్షన్ హౌస్‌కి ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది.ఇప్పుడు, ఆ విజయాల జోలులో సుకుమార్ భార్య తబిత కూడా అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఆధ్వర్యంలో కొత్త నిర్మాణ సంస్థ ఒకటి ఆరంభం కానుంది. ఈ సంస్థ పేరు “తబిత కుమార్ ఫిలిమ్స్” అని తెలుస్తోంది. సుకుమార్ పూర్తి మద్దతుతో, ఈ సంస్థ ద్వారా మంచి కంటెంట్‌తో కూడిన సినిమాలను తీసుకురావడమే లక్ష్యంగా ఉందట.
ఈ కొత్త బ్యానర్ నుంచి మొదటి ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం మరేంటోరో కాదు — తెలుగు యువతలో సంచలనం సృష్టించిన “కుమారి 21ఎఫ్” చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనున్న “కుమారి 22ఎఫ్” అనే సినిమా. 2015లో విడుదలైన కుమారి 21ఎఫ్ సినిమా అప్పట్లో యువత మైండ్‌సెట్‌ను బలంగా హైలైట్ చేసింది. ప్రేమ, స్వాతంత్ర్యం, నమ్మకం, ఆధునిక యువత ఆలోచనా విధానం వంటి అంశాలతో ఆ సినిమా సెన్సేషన్‌గా నిలిచింది. హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ జంటగా నటించిన ఆ చిత్రం సుకుమార్ రైటింగ్‌లో సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ పరంగా కూడా ఆ సినిమాకు అపారమైన విజయమొచ్చింది.
ఇప్పటివరకు సోషల్ మీడియాలో అనేక అభిమానులు, సినీ ప్రేమికులు “కుమారి 21ఎఫ్ కి సీక్వెల్ రావాలి” అంటూ పదేపదే కోరుతూ వచ్చారు. ఆ కోరికను దాదాపు 10 సంవత్సరాల తర్వాత సుకుమార్ కుటుంబం తీర్చబోతున్నట్లు సమాచారం. “కుమారి 22ఎఫ్” సినిమా అదే దర్శకుడితో అదే కానీ కొత్త నటీ నటులతో కొన్ని మార్పులు చేయబోతున్నారట. కథ ఆధునిక యువతలో మారుతున్న మానసికత, ప్రేమ పట్ల ఉన్న కొత్త తరహా ఆలోచనలు, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాల చుట్టూ తిరుగుతుందట. కొన్ని కీలక పాత్రల్లో కొత్త నటీనటులను తీసుకోవడానికి కూడా చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి, 10 ఏళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్న కోరిక నెరవేరింది. సుకుమార్–తబిత జంట నుంచి రాబోతున్న “కుమారి 22ఎఫ్” సినిమా టాలీవుడ్‌లో మరో సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి