టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘ మన శంకర వరప్రసాద్ గారు ’ ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. అనిల్ రావిపూడి తన స్టైల్‌కు తగ్గట్టు కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మేళవింపుతో ఈ కథను రూపొందిస్తున్నాడు. చిరంజీవి కెరీర్‌లో ఇంత లైట్‌హార్ట్‌డ్ కానీ మాస్ టచ్ కలిగిన రోల్ చాలా కాలం తర్వాత వస్తోందని అభిమానులు చెబుతున్నారు.


‘మన శంకర వరప్రసాద్ గారు’లో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోనుందని ఈ సినిమా యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి - సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. చిరంజీవి ఎనర్జీ, అనిల్ రావిపూడి టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని టాక్. బాక్సాఫీస్ అంచనాల విషయానికి వస్తే, గత సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ వసూళ్లను సాధించింది.


ఆ సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు చిరంజీవి సినిమా రూ.300 కోట్ల గ్రాస్ ఫీట్ సాధిస్తుందా ? అనే చర్చ సినీ సర్కిల్స్‌లో మొదలైంది. సంక్రాంతి సెలవుల సీజన్‌లో కుటుంబ ప్రేక్షకులకు అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ పెద్ద ఎస్సెట్ కానుంది. ఈ సినిమా లో సోష‌ల్ ఎలిమెంట్స్ తో పాటు స‌మాజంలో ప్ర‌స్తుతం ఉన్న ఫ్యామిలీ అంశాల‌ను చ‌క్క‌టి కామెడీ టైమింగ్‌తో చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో ఉండబోతోందట. చిరంజీవి పాత్రలో మానవీయత, సరదా, సున్నిత భావాలు అన్నీ కలగలిపి ఉంటాయని సమాచారం. మొత్తానికి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా మెగాస్టార్ కెరీర్‌లో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని అభిమానులు నమ్ముతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: