యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. తారక్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మూవీ తో తారక్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత తారక్ దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా తారక్ "వార్ 2" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని కూడా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ మాత్రం తారక్ కి నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటివరకు మేకర్స్ టైటిల్ను ఫిక్స్ చేయలేదు. కానీ ఈ మూవీ కి డ్రాగన్ అనే టైటిల్ను ఆల్మోస్ట్ ఫిక్స్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని నార్త్ ఇండియాలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తారక్ కి నార్త్ లో అద్భుతమైన మార్కెట్ ఏర్పడింది. దానితో నార్త్ లో ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసినట్లయితే ఈ మూవీ కి మంచి టాక్ వస్తే అక్కడ నుండి భారీ కలెక్షన్లు వస్తాయి అని ఈ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ , ప్రశాంత్ నీల్ ఇద్దరికి మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాకు గనక మంచి టాక్ వచ్చినట్లయితే ఈజీగా ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్లను రాబడుతుంది అని తారక్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: