టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్‌హీరోయిన్‌గా ఎదిగిన నటి శ్రీలీల. ప్రస్తుతం బిజీ హీరోయిన్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ‘పెళ్లి సందడి’తో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆమె, ఆ ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులు ఆమె చేతికి వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కూడా వరసగా దక్కాయి. అయితే, ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాకపోవడంతో శ్రీలీల సినిమాల ఎంపికలపై కొంత విమర్శలూ వచ్చాయి. అయినా, ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా తనదైన దారిలోనే ముందుకు సాగుతోంది శ్రీలీల. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ ప్రారంభంలో నాకు స్క్రిప్ట్‌లు ఎంచుకోవడం అంతగా రాదు. వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని అనిపించింది. కానీ ఇప్పుడు నాకు ఏమి సరిపోతుందో, ఏమి కాదు అనే అవగాహన వచ్చింది ” అని తెలిపింది.
తనపై వస్తున్న రొటీన్ పాత్రల విమర్శల గురించి కూడా ఆమె స్పష్టంగా స్పందించింది. “ ప్రేక్షకులు నాలో చూసే అంశాలనుంచి దూరం కావాలని ఇప్పటికి అనుకోవడం లేదు. నేను కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నా, ఒక వర్గం ప్రేక్షకులు నా పనితీరును ఇష్టపడుతున్నారు. అది నాకు చాలు ” అని చెప్పింది. చదువు , సినిమా రెండింటినీ సమానంగా కొనసాగించడం శ్రీలీల కు ఒక పెద్ద సవాలు. ఆమె ఇప్పటికీ తన చదువును కొనసాగిస్తూ , సినిమాలకు సమయం కేటాయిస్తోంది. అందుకే ... ఫుల్ ప్రిపరేషన్ అవసరం ఉన్న గంభీర పాత్రలు ప్రస్తుతం చేయలేకపోతున్నట్టు చెబుతోంది. “ తాను నటిస్తున్న ప్రతి సినిమా నాకు ఒక కొత్త అనుభవం ఇస్తుంది. భవిష్యత్తులో స్క్రిప్ట్‌లను మరింత జాగ్రత్తగా ఎంచుకుంటా ” అని ఆమె తెలిపింది.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒకటి పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. క్రమంగా తన ఇమేజ్‌కి సరిపడే, అలాగే నటనకు స్కోప్ ఉన్న పాత్రలను చేయాలన్నదే ఆమె లక్ష్యం అని చెపుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి