హీరోయిన్స్ వయసు 35 సంవత్సరాలు దాటినప్పటికీ యంగ్ హీరోయిన్లకు పోటీగా పలు పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఈ విషయం పైన తమన్నా మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం హీరోయిన్స్ కి 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రేక్షకులు చూసే విధానం ఇప్పుడు పూర్తిగా మారిందని, ఒకప్పుడు హీరోయిన్స్ కి 30 దాటితే చాలు కథ ముగిసిందనుకోనేవారు కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నటీనటులకు కూడా మంచి బలమైన క్యారెక్టర్లు వస్తున్నాయి. తాను కూడా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు పదేళ్లపాటు ప్లాన్ చేసుకున్నాను, ముఖ్యంగా 30 ఏళ్లలోపు వివాహం చేసుకొని పిల్లలతో కుటుంబం అనుకున్నాను , కానీ 30 దాటిన తర్వాత ఆ సమయంలోనే నేను నిజంగా ఎవరు? నా వ్యక్తిత్వం ఏంటో తెలుసుకున్నాను, అదృష్టవశాత్తు అప్పటినుంచి ఇండస్ట్రీలో మహిళల కోసం శక్తివంతమైన పాత్రలు కూడా రాయడం జరిగిందని తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మార్పు తీసుకువచ్చింది.
వృద్ధాప్యం అనేది కూడా చాలా అద్భుతమైనది అది మన అనుభవాల ప్రతిబింబం లాంటిది అంటూ తెలిపింది తమన్నా. తాను చేస్తుంటా ప్రతి పాత్ర కూడా తనకు మరింత బలాన్ని ఇస్తున్నాయంటూ తెలియజేసింది. ప్రస్తుతం డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కాబోతోంది. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలలో నటిస్తోంది తమన్నా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి