- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఎందుకో గానీ... మాస్ జాతర సినిమా విడుదలకు ముందు నుంచీ పెద్దగా హైప్ లేకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రవితేజ, శ్రీలీల, నిర్మాత నాగవంశీ అనే కాంబినేషన్‌పై మొదట్లోనే పెద్ద ఆసక్తి కనబడలేదు. రవితేజ ఇటీవల విడుదలైన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడం, శ్రీలీలకు కూడా వరుస ఫ్లాపులు ఎదురవడం వల్ల ఈ సినిమాపై నమ్మకం తగ్గిపోయింది. అంతేకాదు, నాగవంశీ గత ప్రాజెక్టులు కింగ్‌డమ్, వార్ 2 నిరుత్సాహకర ఫలితాలు ఇవ్వడం కూడా బజ్ తగ్గడానికి కారణమైంది. మొదటే విడుదల కావాల్సిన మాస్ జాతర అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఈ వాయిదాల పర్వం కూడా సినిమాపై ఉన్న ఉత్సాహాన్ని తగ్గించింది. ఇప్పుడు చివరికి ఈ సినిమా అక్టోబర్ 31న ప్రీమియర్స్‌తో విడుదల కానుంది. అయితే ప్రీమియర్లకు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అంతగా కనిపించడం లేదు.


అదే సమయంలో బాహుబలి: ది ఎపిక్ రీ రిలీజ్‌కి మాత్రం ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు, మోంథా తుపాను ప్రభావం కూడా రిలీజ్‌పై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటం వల్ల థియేటర్లకు జనం రావడం కష్టమవుతుంది. నెలాఖరు కావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, పైగా బాహుబలి వంటి భారీ పోటీ తో మాస్ జాతరకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. నాగవంశీ ఈ విడుదల తేదీని మార్చే అవకాశమే లేదు, ఎందుకంటే ఈ డేట్‌ని ఫిక్స్ చేసింది సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థ. వారి ఒత్తిడి కారణంగానే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత ఆలోచన మాత్రం సింపుల్‌గానే ఉంది. ప్రీమియర్ షోల నుండి మంచి టాక్ వస్తే, కనీసం ఓపెనింగ్ డే కలెక్షన్లు కాస్త పుంజుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి, మాస్ జాతర భవితవ్యం పూర్తిగా ప్రీమియర్ టాక్ మీదే ఆధారపడి ఉందని చెప్పవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: