 
                                
                                
                                
                            
                        
                        ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మ అసలు భూమి శెట్టినే ఎందుకు ఎంచుకున్నారని విషయానికి వస్తే.. తన పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఎంచుకున్నారట. వాస్తవానికి ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఒక సీరియల్ నటి. కన్నడలో వచ్చిన కిన్నెర అనే టీవీ సీరియల్ తో నటిగా పేరు సంపాదించింది. తెలుగులో నిన్నే పెళ్లాడుతా అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది. అలాంటి క్రేజ్ తోనే ఈమె పలు సినిమాలలో కూడా నటించింది. ఈమె నటించిన పాత్రలకు కూడా మంచి పేరు రావడంతో అప్పటినుంచి ఎక్కువగా భూమి శెట్టి సినిమా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.
తెలుగులో మొదటిగా నటించిన సినిమా షరతులు వర్తిస్తాయి ఈ సినిమా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రంలో మరో నటుడు సత్యదేవ్ భార్యగా నటించింది భూమి శెట్టి. ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేస్తున్న మహాకాళి చిత్రంలో ప్రధాన పాత్రలో నటించే అవకాశాన్ని అందుకుంది. భూమి శెట్టి కాళీ పాత్రలో చాలా అద్భుతంగా కనిపిస్తున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే భూమిశెట్టికి రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగులో అవకాశాలు వచ్చా అవకాశం ఉన్నాయి.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి