షూటింగ్‌ దశలో దూసుకుపోతున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించి దర్శకుడు బుచ్చి బాబు సనా టీం నుంచి ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. భారీ అంచనాలతో ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం శ్రీలంకలో కీలక షెడ్యూల్‌‌ను జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో ఒక అద్భుతమైన రొమాంటిక్‌ సాంగ్‌తో పాటు కొన్ని ఎమోషనల్‌, యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా తెరకెక్కుతున్నాయని యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి. తాజాగా హీరో రామ్‌ చరణ్‌, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, అలాగే సినిమా టీం శ్రీలంకకు చేరుకున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది మూవీ యూనిట్‌. రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ ల్యాండింగ్‌ ఫొటోలు, బీహైండ్‌ ద సీన్స్‌ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అప్‌డేట్‌తో సినిమా పట్ల అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.


ఈ సందర్భంగా ప్రసిద్ధ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ కూడా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో రామ్‌ చరణ్‌తో దిగిన కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తూ, “చరణ్‌ అన్న ఈ సినిమాలో పడుతున్న కష్టం, చేస్తున్న కృషి నిజంగా అద్భుతమైనది. ఆయన డెడికేషన్‌ చూసి ఆశ్చర్యపోతున్నాను. ఈ సినిమా తెరపై ఎలా అలరిస్తుందో చూడటానికి నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అని రాసుకొచ్చారు. నిజానికి గతంలో జానీ మాస్టర్ ఎదురుకున్న కొన్ని టఫ్ పరిస్ధితులకి పరోక్షకంగా బన్నీనే కారణం అంటూ టాక్ వినిపించింది. మరీ అలాంటి వ్యక్తికి చరణ్ ఛాన్స్ ఇవ్వండం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు జనాలు. బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామాలో, చరణ్‌ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో స్పోర్ట్స్‌, ఎమోషన్‌, ఫ్యామిలీ డ్రామా అన్నీ సమపాళ్లలో ఉంటాయని సమాచారం.



ఈ చిత్రంలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకి ప్రధాన బలంగా నిలవనుందని యూనిట్‌ తెలిపింది. అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.  ఇప్పటికే ఆయన కంపోజ్‌ చేసిన కొన్ని ట్యూన్స్‌ యూనిట్‌లో హుషారుని నింపినట్లు సమాచారం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. టెక్నికల్‌గా, విజువల్‌గా, ఎమోషనల్‌గా ఈ సినిమా కొత్త రేంజ్‌లో ఉండబోతుందని టీం నమ్మకం వ్యక్తం చేస్తోంది.అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, ‘పెద్ది’ సినిమా 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా రామ్‌ చరణ్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని, థియేటర్లలో భారీ రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: