ఏంటి మంచు లక్ష్మి విష్ణు తో గొడవలు పడి తన కూతుర్ని స్కూల్ మాన్పించేసిందా.. తమ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు అని చెప్పి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందేంటి..ఇంతకీ తాజా ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది సెలెబ్రిటీలు తమ పిల్లలకి లగ్జరీ జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటారు. ఇక సెలబ్రిటీల పిల్లలు కూడా చాలా లగ్జరీగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ మంచు లక్ష్మి మాత్రం తన కూతురికి లగ్జరీ జీవితాన్ని ఇవ్వాలి అనుకోవడం లేదట. ఒకవేళ తన కూతురిని అడవిలో వదిలేసినా ఆకులు తిని బతకాలి అన్నట్లుగా నేర్పిస్తుందట.అందుకే తన కూతురికి చిన్నప్పటినుండి లగ్జరీ లైఫ్ ని అలవాటు చేయకుండా అందరిలాగే సాదాసీదా లైఫ్ ని అలవాటు చేయాలని చూస్తుందట.అందుకే ఒకప్పుడు తన తమ్ముడు విష్ణు స్కూల్ కి పంపించి ఇప్పుడు ఆ స్కూల్ నుండి మాన్పించేసి  ఓ చిన్న స్కూల్ కి పంపించిందట. 

అయితే విష్ణు స్కూల్ కి వెళ్తే మంచు లక్ష్మి కూతురు అని చెప్పి చాలా కేరింగ్ చూపిస్తారట. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా కార్లో వెళ్తే కార్ డోర్ తీసి చాలా గౌరవంగా చూస్తారట. టీచర్స్ కూడా ఆమెను స్టూడెంట్ లా కాకుండా చాలా గౌరవిస్తారట. అయితే దీనివల్ల తన కూతురికి ఇబ్బంది వస్తుంది అని తన కూతుర్ని స్టూడెంట్ లాగా చూడాలి కానీ ఒక సెలబ్రిటీ లాగా చూస్తే బాగుండదు అనే ఉద్దేశంతోనే ఆరు నెలల క్రితం మంచు విష్ణు స్కూల్ మాన్పించేసి వేరే స్కూల్ కి పంపిస్తోందట లక్ష్మి.అయితే స్కూల్ ఎప్పుడైతే మాన్పించిందో ఆ తర్వాత ఇంట్లో పెద్ద గొడవ జరిగిందట.

ఎందుకు నువ్వు ఈ స్కూల్ కాకుండా చిన్న స్కూల్ కి పంపిస్తున్నావు అని ఇంట్లో వాళ్ళు గోల గోల చేశారట. కానీ తన కూతురికి లగ్జరీ లైఫ్ ని ఇవ్వాలనుకోవడం లేదని, తనని సెలబ్రిటీ లాగా కాకుండా మామూలు వ్యక్తిలాగే చూడాలని నేను అనుకుంటున్నాను అని చెప్పిందట. ఇక ప్రస్తుతం ముంబైలో ఉన్నామని, ముంబైలో నా కూతుర్ని ఎవరు గుర్తుపట్టారు కాబట్టి ఆమె చాలా స్వేచ్ఛగా బ్రతుకుతుంది.సెలబ్రిటీ అని కూడా ఎవరికీ తెలియదు. అందుకే ముంబైకి వచ్చేసాం అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: