మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఇది ఒక ప్రత్యేక చిత్రం. ఆయన 75వ సినిమాగా రూపొందిన ‘మాస్ జాతర’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పించింది.‘ధమాకా’ తర్వాత రవితేజ మరియు శ్రీ లీల కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి కూడా ఆ కెమిస్ట్రీ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందనే ఆశతో అభిమానులు థియేటర్లకు తరలివచ్చారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై, మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.


రవితేజ ఈ సినిమాలో లక్ష్మణ్ భేరి అనే రైల్వే పోలీస్ పాత్రలో నటించాడు. రవితేజ ఎనర్జీ ఈ సినిమాలో కూడా హైలైట్. రైల్వే పోలీస్ లుక్‌లో ఆయన స్టైల్, బాడీ లాంగ్వేజ్ అభిమానులను సంతృప్తిపరుస్తుంది. అయితే, కథలో లోతు లేకపోవడం వల్ల ఆయన నటన పూర్తిగా మెరవలేకపోయింది.  నిజానికి ఈ సినిమా కధ ముందుగా హీరో నాని దగ్గరకి వెళ్లిందట. ఆయన స్టోరీ విని రిజెక్ట్ చేశారట. ఆ తరువాత ఇద్దరు యంగ్ హీరోస్ కూడా రిజెక్ట్ చేశారట. ఫైనల్లీ ఈ కధ రవి తేజ వద్దకి వచ్చి ఆగింది. ఆయన ఖాతాలో ఫ్లాప్ పడేలా చేసింది. దీంతో అందరు నాని ని లక్కి ఫెలో అంటూ పొగిడేస్తున్నారు. ఫ్లాప్ సినిమా నుండి తప్పించుకున్నావ్ అంటున్నరు.

 

ఇక శ్రీ లీల ఎప్పటిలాగే చురుకుగా కనిపించింది. ఆమెతో ఉన్న సీన్లు కొంత ఫ్రెష్‌నెస్‌ను తెస్తాయి కానీ ఎమోషనల్ కనెక్షన్ మాత్రం కనబడదు.నవీన్ చంద్ర విలన్ పాత్రలో తనదైన స్థాయిలో ఇంప్రెస్ చేశాడు. కానీ అతని పాత్రకు సరైన బ్యాక్‌స్టోరీ లేకపోవడం వల్ల భయపెట్టే విలన్‌గా నిలబడలేకపోయాడు. రాజేంద్ర ప్రసాద్ పాత్ర భావోద్వేగంగా ఉండాల్సింది కానీ రాతపరంగా బలహీనంగా ఉండటంతో ఆ కనెక్షన్ పండలేదు. ‘మాస్ జాతర’ పక్కా కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కిన సినిమా. దర్శకుడు భాను భోగవరపు, ప్రేక్షకులు మాస్ సినిమాల్లో ఆశించే అన్ని అంశాలనూ కలపడానికి ప్రయత్నించారు — హీరో ఇన్‌ట్రడక్షన్ సీన్, హీరోయిన్‌తో రొమాంటిక్ సాంగ్స్, పంచ్ డైలాగులు, విలన్ దందా, క్లైమాక్స్ ఫైట్ ఇలా అన్ని.సినిమా మొదటి భాగంలో యాక్షన్, కామెడీ సన్నివేశాలు మామూలుగా ఆకట్టుకుంటాయి. కానీ తర్వాతి భాగంలో కథనం కొంచెం సైలెంట్ గా మారుతుంది. తెలంగాణా యాసలో మొదలైన కథలో హీరో అకస్మాత్తుగా సాధారణ డైలాగ్‌లకు మారిపోతాడు. హీరోయిన్ శ్రీకాకుళం యాసలో మాట్లాడితే ఆమె తండ్రి మాత్రం మామూలుగా మాట్లాడతాడు — ఇది స్క్రీన్‌పై కన్ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. విలన్ మాటల్లో మధ్య మధ్యలో రాయలసీమ యాస చొరబడుతుంది. ఈ భాషా గందరగోళం సినిమాలో కంటిన్యూయిటీని కొంచెం తగ్గిస్తుంది.సినిమాలో పాటలు కూడా ఒక షెడ్యూల్ మాదిరిగా వస్తున్నాయి. సీన్ ముగిసిందంటే వెంటనే “ఇప్పుడు పాట టైమ్” అన్నట్టు చేర్చినట్లు అనిపిస్తుంది. ఇది సినిమా నడకను కొంత నెమ్మదింపజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: