నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ కొంత కాలం క్రితం లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం అనగా 2024 అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా ఆ సమయంలో మంచి కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో సంవత్సరం కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమాకు ఆ సమయంలో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 10 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 2.80 కోట్లు , ఆంధ్ర లో 9.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఏపీ మరియు తెలంగాణలో కలుపుకొని ఈ మూవీ కి 22.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక తమిళనాడు ఏరియాలో 3.50 కోట్లు , కేరళ లో 6 కోట్లు , హిందీ లో 1.20 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షలు , ఓవర్సీస్ లో 7 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 40.52 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి వరల్డ్ వైడ్ గా 40.50 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ కి ఆ సమయంలో 10.52 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: