టాలీవుడ్‌లో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి మరో పెద్ద ఫెస్టివల్ దగ్గరపడుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ‘ఆంధ్ర కింగ్’ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమాకి యువ దర్శకుడు మహేశ్ బాబు (డైరెక్టర్, యాక్టర్ కాదు) మెగాఫోన్ వహించగా, నిర్మాణ బాధ్యతలు ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నారు. ఇంకా మల్టీటాలెంటెడ్ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో నటించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, మోషన్ పోస్టర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. రామ్ కొత్త లుక్, ఎనర్జిటిక్ యాక్షన్, మాస్ డైలాగులు అభిమానుల్లో ఉత్సాహం రేపుతున్నాయి.
‘ఆంధ్ర కింగ్ తాలుకా… మనమే సీన్ రూల్ చేద్దాం’ అంటూ వచ్చిన పాట యూత్‌లో వైరల్ అయింది. మొదట నిర్మాతలు ఈ సినిమాను నవంబర్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఒక రోజు ముందుగానే అంటే నవంబర్ 27న థియేటర్లలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. కారణం స్పష్టమే - రిలీజ్ స్ట్రాటజీ! 28 తేదీకి సొలో రిలీజ్ అయినా, ఒక వారం తర్వాతే బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌లో వచ్చే ‘అఖండ 2’ దుమ్ము రేపబోతోంది. ఆ సినిమా పట్ల ఉన్న మాస్ క్రేజ్ వల్ల ‘ఆంధ్ర కింగ్’కు రెండో వారంలో భారీ పోటీ ఎదురవుతుంది. అందుకే నిర్మాతలు ఒక రోజు ముందుగా రిలీజ్ చేస్తే, వర్కింగ్ డేస్‌లో వర్డ్ ఆఫ్ మౌత్ పెంచుకుని, వీకెండ్ కలెక్షన్లను మాక్సిమమ్‌గా దక్కించుకోవాలనే యత్నంలో ఉన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాయని, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్‌లు థియేటర్లలో విజువల్ ఫీస్ట్‌గా నిలుస్తాయని టాక్. రామ్ ఈసారి పూర్తిగా మాస్ లుక్‌తో అలరిస్తున్నాడట. డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషన్ – అన్నీ మిక్స్ అయిన కాంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దారట. ‘ఆంధ్ర కింగ్’కు హిట్ టాక్ వస్తే రామ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కానీ టాక్ సగటుగా ఉంటే మాత్రం బలమైన ప్రమోషన్స్, ఫ్యాన్ షోలు, సోషల్ మీడియా డ్రైవ్ అవసరం అవుతుంది. ఇప్పుడు మొత్తం ఫోకస్ ట్రైలర్‌పై ఉంది. అది సూపర్ ఇంప్రెషన్ ఇస్తే, ఈ నెల చివర్లో “ఆంధ్ర కింగ్” టాలీవుడ్ బాక్సాఫీస్‌కి కొత్త రాజుగా అవతరిస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి