ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయానికి సంబంధించి చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలో జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన ఇప్పుడు పెద్ది చిత్రంలో మళ్లీ అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నట్లు తెలిసింది. ఇందులో అచ్చియమ్మ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు మైకు పట్టుకొని మరి జాన్వీ కపూర్ ఏదో ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్ మాత్రం అభిమానులను ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది.
మరొకసారి పల్లెటూరి అమ్మాయి పాత్రలో మరింత అందంగా కనిపించేలా కనిపిస్తోంది జాన్వీ. పెద్ది సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో పాటు దివ్యేందు తదితర నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు. అందుకే తన తదుపరి చిత్రాన్ని ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేశారు రామ్ చరణ్
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి