టాలీవుడ్ అలనాటి హీరో రాజశేఖర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నే కాకుండా మాస్ ఆడియన్స్ ని కూడా బాగా అలరించారు. ఈ మధ్యకాలంలో కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంపు చిత్రంలో రాజశేఖర్ సినిమాలో నుంచి"ఇదేటమ్మా మాయ మాయ " పాట పెట్టడంతో మరొకసారి వైరల్ గా మారుతున్నారు. చాలామంది ఈ పాటను రీ క్రియేట్ చేస్తూ పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ విషయానికి రాజశేఖర్ కూడా చాలా ఆనంద పడుతున్నారు. ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా తర్వాత రాజశేఖర్ చాలా గ్యాప్ తీసుకున్నారు.


టాలీవుడ్ హీరో శర్వానంద్ లీడ్ రోల్ పాత్రలో నటిస్తున్న చిత్రం బైకర్. ఈ చిత్రంలో హీరో రాజశేఖర్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఇప్పటివరకు ఈ విషయాన్ని చిత్ర బృందం చాలా సీక్రెట్ గానే ఉంచినట్లు తెలుస్తోంది. అయితే నిన్నటి రోజున జరిగిన బైకర్ గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్లో హీరో రాజశేఖర్ ముఖ్యఅతిథిగా  తన భార్య జీవితాలతో కలిసి ఇక్కడ కనిపించడం గమనార్హం. అయితే ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి పలు విషయాలను తెలియజేశారు.


ముఖ్యంగా తాను గత కొద్ది రోజుల నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేశారు. అదే ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్. ఈ విషయం పైన రాజశేఖర్ గతంలో మాట్లాడుతూ ఈ వ్యాధి జీర్ణాశయాంతర సమస్యని , దీనివల్ల విరోచనాలు, ఉబ్బరం, కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు ప్రధాన లక్షణాలు అంటూ తెలియజేశారు. ఈ సమస్య వల్ల తాను చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నానని రాత్రి సమయాలలో ఎక్కువగా నిద్ర పట్టడం లేదని తెలియజేశారు. కొన్ని సందర్భాలలో దీనివల్ల కోపం వస్తుందని నా గురించి తెలిసిన వాళ్ళు తాను ఏమన్నా కూడా పట్టించుకునేవారు కాదు అంటూ తెలియజేశారు రాజశేఖర్.

మరింత సమాచారం తెలుసుకోండి: