ఇక, ఈ ప్రాజెక్ట్‌ని మరింత ఎత్తుకి తీసుకెళ్లేందుకు బుచ్చిబాబు వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అందిన సమాచారం ప్రకారం, త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల కానుంది. అయితే, ఆ పాటను సాధారణంగా రిలీజ్ చేయడం కాదు — మేకర్స్ ప్లాన్ చేస్తున్నది పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌లో. తెలుగు సినీ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, సంగీత మాంత్రికుడు ఏఆర్. రెహమాన్ స్వయంగా వీడియో రూపంలో ఈ పాట రిలీజ్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇది నిజమైతే, తెలుగు సినిమా చరిత్రలో చాలా అరుదైన ఘట్టం అవుతుంది. ఎందుకంటే రెహమాన్ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకి కూడా ఈ విధంగా ప్రమోషన్‌లో భాగమై వీడియో మెసేజ్ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన సాధారణంగా మీడియా ప్రచారాలకు దూరంగా ఉంటారు. కానీ ‘పెద్ది’ ప్రాజెక్ట్ కోసం ఆయన వ్యక్తిగతంగా ముందుకు రావడం, ఈ సినిమా స్థాయి, క్వాలిటీ గురించి చెప్పకనే చెబుతోంది.మేకర్స్ కూడా ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోవాలని చూస్తున్నారని సమాచారం. మొదటి సింగిల్‌కి సంబంధించిన టీజర్ విజువల్స్, చరణ్ కొత్త లుక్, గ్రామీణ నేపథ్యం—అన్ని ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చే విధంగా రూపొందించబోతున్నారట. చరణ్ మాస్, క్లాస్ షేడ్స్‌ని కలిపిన విధంగా కనిపిస్తారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి