ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో ప్రేక్షకులకు బాగా తెలుసు. “ కేజీఎఫ్ ” సిరీస్‌లో చూపిన రా ఇంటెన్సిటీని మించి ఉండేలా “ డ్రాగన్ ” లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయని టాక్. ఈ స్పెషల్ సీక్వెన్స్‌ను విదేశీ యాక్షన్ మాస్టర్స్ సూపర్విజన్‌లో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ గెటప్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ప్రెజెంటేషన్ అన్నీ కలిసి థ్రిల్లింగ్ విజువల్ ఫీస్ట్‌గా డ్రాగన్ సినిమాను మలచాలని ప్రశాంత్ నీల్ ప్రణాళిక వేశాడట.
డ్రాగన్ స్క్రిప్ట్ పరంగా కూడా ఈ సినిమా చాలా బలంగా ఉందని టాక్. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టు పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రతి సీన్‌లో కూడా ఇమోషన్‌తో కూడిన ఇన్‌టెన్సిటీ ఉండేలా రాసాడట. ఈ కారణంగానే “డ్రాగన్” ప్రశాంత్ నీల్ ఫిల్మోగ్రఫీలోనే అత్యుత్తమ సినిమాగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్, హై వాల్యూ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి “డ్రాగన్” ఎన్టీఆర్ కెరీర్‌లో గేమ్ చేంజర్‌గా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి