మెగాస్టార్ చిరంజీవి ఆఖరుగా భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదల అయి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు అనే రెండు సినిమాలలో నటిస్తున్నాడు. విశ్వంబర సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయిన ఈ సినిమాకు చాలా గ్రాఫిక్స్ పనులు ఉండడంతో ఈ మూవీ డిలే అవుతూ వస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిరంజీవి కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించాడు.

ఇక మన శంకర వర ప్రసాద్ గారు మూవీ షూటింగ్ మాత్రం కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అనిల్ రావిపూడిసినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే చిరంజీవి తన నెక్స్ట్ మూవీ ని బాబి కొల్లి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ టైటిల్ ని ఫిక్స్ చేయన నేపథ్యంలో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని లాంచ్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో మాళవిక మోహనన్ , చిరంజీవి కి జోడిగా నటించనున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఆ తర్వాత ఆ వార్త ఆవాస్తవం అని వార్తలు బయటికి వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాలో తమిళ నటుడు కార్తీ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయింది. ప్రస్తుతం ఈ వార్త కూడా అవాస్తవం అని తెలుస్తుంది. ఇలా మెగా 158 మూవీ కి సంబంధించి అనేక గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: