టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ కొన్ని సంవత్సరాలు క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఆఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలయ్య హీరో గా బోయపాటి శ్రీను అఖండ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీని ఇప్పటికే అనౌన్స్ చేయడంతో ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ల విషయంలో బోయపాటి చాలా ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సంబంధించిన మొదటి సాంగ్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క మొదటి పాటను వచ్చే వారంలో విడుదల చేసే విధంగా బోయపాటి శ్రీను ప్లాన్ చేసినట్లు ఇక నవంబర్ 4 వ వారంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసే విధంగా బోయపాటి శ్రీను ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పక్కా ప్లానింగ్ తో ఈ మూవీ ప్రమోషన్లను ముందుకు తీసుకువెళ్లడానికి బోయపాటి శ్రీను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: