హర్రర్ కామెడీ జోనర్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్. కాంచన ఫ్రాంచైజీలో భాగంగా కాంచన 4 సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి హర్రర్ గ్లామర్ టచ్ కూడా జోడించబోతున్నట్లు కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా ఇందులో హీరోయిన్ పూజ హెగ్డే తో పాటు మరో హీరోయిన్ నటిస్తున్నారనే విదంగా వినిపిస్తున్న ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.


రాఘవేంద్ర ప్రొడక్షన్ హౌస్ నుంచి పూజ హెగ్డే, నోరా ఫతేహి పేర్లను ప్రకటిస్తూ టీమ్ వారికి వెల్కమ్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో తెలియజేశారు. అలాగే వీరికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేస్తూ భయంకరమైన సన్నివేశాలలో కూడా తమ అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది.. పూజా హెగ్డే కి స్వాగతం, తన అందంతో హర్రర్ ను కూడా మైమరిపించేలా చేస్తుంది నోరా ఫతేహికి స్వాగతం అంటూ పోస్టులు షేర్ చేశారు.


దీంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఒకవైపు డైరెక్టర్ గా ,హీరోగా రాఘవ లారెన్స్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మొదటిసారి పూజా హెగ్డే కూడా ఇలాంటి హర్రర్ జోనర్ లో కనిపిస్తూ ఉండడంతో అభిమానులు కూడా ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నారు. నోరా గ్లామర్ కూడా కాంచన 4 సినిమాకి ప్లస్ అవుతుందని అభిమానులు తెలియజేస్తున్నారు. గతంలో కూడా పూజా హెగ్డే ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని ఆ సినిమాని రిజెక్ట్ చేసింది. మరి ఇప్పుడు హాట్ బ్యూటీగా పేరుపొందిన నోరా ఫతేహి ఎలాంటి పాత్రలో నైనా సరే తన గ్రామర్ తో ఆకట్టుకుంటుంది. మరి అలాంటి హాట్ బ్యూటీ మించి పూజ హెగ్డే పాత్ర ఉంటేనే క్రేజ్ పెరుగుతుంది. లేకపోతే మళ్లీ నిరాశే తప్పదని నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: