యాంకర్ గా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫేమ్ సంపాదించుకుంది విష్ణు ప్రియ.ఆ తర్వాత బిగ్ బాస్ తో ఎంట్రీ ఇవ్వగా మరింత పాపులారిటీ సంపాదించుకున్న విష్ణు ప్రియ పలు టీవీ షోలు ,సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది యాంకర్ విష్ణు ప్రియ. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ 8 లో పాల్గొన్న విష్ణు ప్రియ తాను హౌస్ లోకి వెళ్లినందుకు తనని తాను తిట్టుకున్నానని తెలియజేసింది.


విష్ణు ప్రియ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్లో తాను ఏమీ నేర్చుకోలేదని అన్ని బయట నా లైఫ్ లోనే నేర్చుకున్నానని తెలిపింది. మళ్లీ బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వచ్చినా కూడా తాను వెళ్ళానని, ఒకసారి వెళ్లినందుకే నన్ను నేను తిట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళా చెప్పు తీసుకొని కొట్టుకోవాలని చాలాసార్లు తిట్టుకున్నానని తెలిపింది విష్ణు ప్రియ. హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా నన్ను నేను చాలాసార్లు తిట్టుకున్న కానీహౌస్  నుంచి బయటికి వచ్చిన తర్వాత నన్ను ప్రేమతో ఆదరించిన జనాలు ఉన్నారు కాబట్టే ఒకే అనుకున్నారని తెలిపింది విష్ణు ప్రియ.


ముఖ్యంగా తాను మూడు రోజులపాటు పనిచేశానంటే  నాలుగో రోజు మసాజ్ చేయించుకుని విశ్రాంతి తీసుకునే దాన్ని కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత కాఫీ లేదు, మసాజ్ లేదు, సరిగ్గా నిద్ర లేదు చాలా  ఇబ్బందులు ఎదురయ్యాయని , ముఖ్యంగా హౌస్ లోకి వెళ్ళింది కొత్త ఇల్లు, కొంత డబ్బులు సంపాదించుకోవాలని వెళ్లాను కానీ అది జరగలేదు ఇంకా పాత ఇంట్లోనే ఉన్నాను. హౌస్ నుంచి వచ్చిన డబ్బులను మాత్రం నా ఫ్రెండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారంటు తెలియజేసింది విష్ణు ప్రియ. ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: