పాన్‌ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భాషకు సంబంధం లేకుండా అన్ని ఫిల్మ్‌ ఇండస్ట్రీల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా విశేషమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. తక్కువ కాలంలోనే అందం, నటన, ఆత్మవిశ్వాసం—అల్ల్ చొంబినెద్ చేసి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.  ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్’, ‘భీష్మ’, ‘పుష్ప: ది రైజ్’, ‘ఆనిమల్’ వంటి పలు పాన్‌ ఇండియా స్థాయి చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకుంది. రష్మిక నటన, ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌, ఆ చిలిపి నవ్వు—అన్ని ఆమెను దేశవ్యాప్తంగా “నేషనల్‌ క్రష్‌”గా మార్చాయి.ప్రస్తుతం రష్మిక నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ప్రేమ కథ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మిక ప్రధాన పాత్రలో మెరిస్తుండగా, దీక్షిత్‌ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్‌, మాస్‌ మూవీస్‌  సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


అల్లు అరవింద్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 7న గ్రాండ్‌ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్‌లలో భాగంగా ఇటీవల జరిగిన ఈవెంట్‌లో రష్మిక తన వ్యక్తిగత విషయాలను ఓపెన్‌గా పంచుకుంది. ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ “మీకు ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు?” అని అడగగా, రష్మిక నవ్వుతూ స్పందిస్తూ— “నాకు టైమ్ దొరికితే నేనెక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో మోటివేషనల్ వీడియోస్‌ చూస్తా. కొన్ని వీడియోస్‌ ఎంటర్ టైన్ మూడ్‌ లిఫ్ట్‌ చేయడానికి చాలా హెల్ప్‌ అవుతాయి. కొన్నిసార్లు అలాంటి వీడియోలు చూడటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మూడ్‌ సెట్‌ అవుతుంది.”



ఇంత ఓపెన్‌గా మాట్లాడిన రష్మిక మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది నెటిజన్లు ఆమె నిజాయితీకి, సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా రష్మిక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌ గురించి మాట్లాడింది. “లాంగ్‌ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అనేది చాలా కష్టమైన విషయం. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన అర్థం, నమ్మకం ఉంటే దూరం ఎప్పుడూ సమస్య కాదు. నేను ఆ బాండింగ్‌ని నమ్ముతాను,” అని చెప్పి తన హృదయాన్నే తెరిచింది.‘ది గర్ల్‌ఫ్రెండ్’ గురించి మాట్లాడుతూ ఆమె ఇంకా చెప్పింది—“ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం నాకు ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడటం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా కూడా అందరికీ కనెక్ట్‌ అవుతుందని నమ్మకం ఉంది.” అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక చివరగా అభిమానులకు మెసేజ్ ఇస్తూ— “మీ ప్రేమే నా ఎనర్జీ. నేను ఎంత పెద్ద స్టార్ అయినా, మీ సపోర్ట్ లేకుంటే అది విలువ లేనిది. అందుకే ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండండి, మీ కలలపై నమ్మకం ఉంచండి,” అని తెలిపింది.రష్మిక మందన్నా ఎప్పటిలానే ఈసారి కూడా తన చిలిపి నవ్వుతో, స్పష్టమైన ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ద్వారా మరోసారి తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకునే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: